NTV Telugu Site icon

Local Body Election: లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ దూరం.. సందిగ్ధంలో బీజేపీ

Mlc

Mlc

Local Body Election: లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ దూరంగా ఉండేందుకు నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సరైన బలం లేని కారణంగా పోటీకి దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే, సూత్రపాత్రయంగా మజ్లిస్ పార్టీకి హస్తం పార్టీ మద్దతు ఇస్తుంది.

Read Also: Vijay Varma : ఒక బంధాన్ని ఐస్‌క్రీంలా ఆస్వాదించాలి..

కాగా, మరోవైపు, గ్రేటర్ హైదారాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే దానిపై భారతీయ జనతా పార్టీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఉన్న ఓట్లు 25 లోపే.. ఎంఐఎం పార్టీకి ఉన్న దాంట్లో సగం ఓట్లు కూడా కమలం పార్టీకి లేవు.. దీంతో కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వచ్చాక నిర్ణయం తీసుకోనుంది. బీజేపీకి ఉన్నా సంఖ్య బలం దృష్ట్యా పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం మొత్తం ఓట్లు 110 ఉండగా.. తుది జాబితాలో మారే అవకాశం ఉంది. కార్పొరేటర్లు 81 ఉండగా, ఎక్స్ అఫిషియో సభ్యులు 29 ఉన్నాయి.