RJ Ventures: ప్రీ లాంచింగ్ పేరిట భారీ మోసం.. 600 మంది నుండి రూ.150 కోట్లు వసూలు..
- ప్రీ లాంచింగ్ పేరిట భారీ మోసం..
- 600 మంది నుండి సుమారు రూ. 150 కోట్లు వసూలు..
- బషీర్ బాగ్ సీసీఎస్ ముందు ఆర్జే వెంచర్స్ బాధితుల ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RJ Ventures: ప్రీ లాంచింగ్ పేరిట భారీ మోసం హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఆర్జే వెంచర్స్ యాజమాన్యం సుమారు 600 మంది నుండి 150 కోట్లు వసూలు చేసినట్లు సంచలన విషయాలు బయటకు రావడంతో పోలీసులు షాక్ అయ్యారు. బాధితులు అందరూ బషీర్ బాగ్ పోలీస్టేషన్ క్యూ కట్టారు. పోలీస్టేషన్ ముందు ఆర్జే బాధితులు అంటూ బ్యానెర్ తో ఆందోళనకు దిగారు. దీంతో బషీర్ బాగ్ పోలీస్టేషన్ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. నారాయణఖేడ్, ఘట్కేసర్ , పటాన్ చెరువు, కర్తను ప్రాంతాలలో అపార్ట్మెంట్ , ఫార్మ్ ల్యాండ్ పేరిట ప్రముఖులతో ఆర్జే వెంచర్స్ ప్రకటనలు చేశారు. దీంతో 2020 లో తాము నమ్మి ఒక్కొక్కరం 20 లక్షల నుండి 50 లక్షల వరకు కట్టామని బాధితులు లబోదిబో మన్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని వాపోయారు.
Read also: Adilabad: మహారాష్ట్రకు మగ పులి.. మరి ఆడ పులి ఎక్కడ?
Also Read
- Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
- Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
వెంచర్ ఎండి భాస్కర్ గుప్త, డైరెక్టర్ సుధారాణి మాటలు నమ్మి సుమారు 600 మంది సుమారు రూ.150 కోట్లు కట్టామని వాపోయారు. తాము ఎన్నిసార్లు అడిగిన నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుండటంతో అనుమానం వచ్చిన బాధితులు ఎండీని నిలదీశామన్నారు. దీంతో ఎండీ భాస్కర్ చెక్కులు ఇచ్చారని తెలిపారు. కానీ అవి కూడా బౌన్స్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వెంచర్ కార్యాలయం సైబరాబాద్ పరిధిలో ఉందని తెలిపారన్నారు.. అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆర్జే వెంచర్స్ ఆస్తులు అమ్మి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్జే వెంచర్స్ 600 మందికి మోసం చేసిందని వాపోయారు. లక్షల్లో మోసపోయామని వెంటనే తమ డబ్బును ఆర్జే వెంచర్స్ ద్వారా ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు. అప్పులు చేసి ఆర్జే వెంచర్స్ పై డబ్బులు కట్టామని, వెంటనే అధికారులు స్పందించాలని కోరారు. ఆర్జే వెంచర్స్ యాజమాన్యం పారిపోకుండా వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Thummala Nageswara Rao: ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుంది..
తాజావార్తలు
-
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..