Revanth Reddy Strong Counter: సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. తాము అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే ఎవడైనా విగ్రహం చేయి వేయండి.. అంటూ కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విగ్రహార్క, ఇన్చార్జి దీపా దాస్ మున్షీ నివాళి అర్పించారు. అనంతరం కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదని మండిపడ్డారు. సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామనని అనుకుంటున్నారని తెలిపారు. సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదన్నారు. అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారు..చేతనైతే ఎవడైనా విగ్రహం చేయి వేయండి.. అని హెచ్చరించారు.
Read also: Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు యువకుడు బలి.. రూ.2కోట్ల అప్పులు చేసిన వైనం
నీ అయ్య (కేసీఆర్) విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నాడు… బిడ్డా.. మీకు అధికారం ఇక కలనే.. ఇక మీరు చినతమడకకే పరిమితం అన్నారు. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు.. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాదన్నారు. మా చిత్తశుద్ధిని ఏ సన్నాసి శంకించనవసరం లేదని మండిపడ్డారు. విచక్షణ కోల్పోయి అర్థం పర్ధం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. సచివాలయం ముందు దొంగలకు, తాగుబోతులకు స్థానం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం అక్కడి నుంచి సెక్రటేరియట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సెక్రటేరియట్ లోపల కాన్వాయ్ దిగి పరిసరాలు పరిశీలించారు. డిసెంబర్ లో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పై ఆర్ అండ్ బి అధికారులతో చర్చించారు. సెక్రటేరియట్ లోపల ఉన్న బాహుబలి ద్వారం మెట్ల మార్గంలో సీఎం రేవంత్ రెడ్డి నడిచి వెళ్లారు.
MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా..