Lavanya Lawyer: యువ హీరో రాజ్ తరుణ్ పై అతడి మాజీ ప్రియురాలు లావణ్య చేసిన ఆరోపణలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. దాదాపు 11 ఏళ్లుగా తనతో సహజీవనం చేస్తున్నాడని లావణ్య పోలీసులను ఆశ్రయించింది. తాజాగా లావణ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాజ్, నేనూ 2012 నుంచి ప్రేమించుకుంటున్నాం.. 2014 నుంచి సహజీవనం చేస్తున్నాం.. మాది భార్యాభర్తల అనుబంధం.. ఎందుకంటే.. గుడిలో పెళ్లి చేసుకున్నాం.. ఎందుకంటే మాది ప్రేమ వివాహం.. అది ఎవరికీ తెలియదు.. ఆయన గుడిలో తాళి కట్టింది నాకు మాత్రమే తెలుసు.
అప్పటి నుంచి ఇండస్ట్రీలో చాలా మందికి నేను రాజ్ తరుణ్, లవర్ అని.. రాజ్ తరుణ్ స్నేహితులందరికీ కూడా తెలుసు కానీ.. సోషల్ మీడియాలో పెళ్లి గురించి ఎప్పుడు ప్రచారం చేసుకోలేదని తెలిపింది. పెళ్లి తరువాత మాకు లాక్ డౌన్ వచ్చిందని ఒక వేళ లాక్ డౌన్ లేకపోయింటే నాకు అందరి సమక్షంలో పెళ్లి చేసుకునేవాడని మీడియాకు చెప్పింది లావణ్య. తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి చేసుకుంటా అనడంతో రాజ్ ను నమ్మానని చెప్పుకొచ్చింది. మరి 7ఏండ్ల తరువాత రాజ్ తరుణ్ పై పోలీస్టేషన్ లో కేసు ఎందుకు పెట్టారు? అని ప్రశ్నించగా.. తనను నమ్మానని లావణ్య తెలిపింది.
Read also: Gannavaram: బాపులపాడు హైవేపై నిలిచిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది.. !
10 ఏళ్లు జైలు శిక్ష-లావణ్య లాయర్..
లీగల్ గా మ్యారేజ్ చేసుకున్నట్లు ఆధారాలు లేనప్పుడు.. పోలీసులు, లాయర్లు లావణ్య, రాజ్ పెళ్లి చేసుకున్నట్లు ఎలా ఒప్పుకుంటారు ? అనే మీడియా ప్రశ్నకు లావణ్య తరపు లాయర్ మాట్లాడుతూ.. లావణ్య కుటుంబానికి రాజ్ తరుణ్ సన్నిహితుడని, కుటుంబంతో కలిసి ఉన్న ఫొటోను మీడియాకు చూపించాడు. వివాహిత స్త్రీ పేరును ఉపయోగించడం నేరం. డమ్మీ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని శారీరకంగా వాడుకోవడం సరికాదన్నారు. లావణ్యకు తాను చాలా అన్యాయం చేశానని, ఇందుకు సంబంధించిన 700కు పైగా ఆధారాలను పోలీసులకు సమర్పించినట్లు తెలిపారు. రాజ్ తరుణ్-లావణ్య పెళ్లి చేసుకోలేదని ఆయన చెబుతున్నది అబద్ధం. 11 ఏళ్లుగా లావణ్యను వాడుకుంటున్న మాట వాస్తవమే.
ఈ 11 ఏళ్లలో రెండు సార్లు గర్భం దాల్చిన మాట నిజమే కానీ ఒకసారి గర్భస్రావం అయిందని స్వయంగా రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడని లాయర్ చెప్పుకొచ్చాడు. లావణ్య.. రాజ్ తరుణ్ పై బ్లాక్ మెయిల్ చేసేందుకు కేసు పెట్టలేదని తెలిపాడు. కొత్త చట్టాల్లో యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్న వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. లావణ్యకు జరిగిన మోసంపై ఆధారాలు వున్నాయని న్యాయవాది తెలిపారు. పెళ్లి జరిగిందనే దానిపై కాకుండా ఇప్పటి వరకు రాజ్ తరుణ్, లావణ్యపై చేసిన జరిగిన మోసంపై సెక్షన్లు ఉన్నాయని కుండబద్దలు కొట్టినట్లు చెప్పుకొచ్చారు క్లారిటీ ఇచ్చారు. అయితే లాయర్ మాటల్లో రాజ్ తరుణ్ కు కనీసం 10 సంవత్సరాలైన జైలు శిక్ష పడే అవకాం ఉందని చెప్పకనే చెప్పనట్లు తెలుస్తుంది. మరి లావణ్య, రాజ్ తరుణ్ వ్యవహారంలో ఇంకా ఎన్ని ట్విస్ట్ లు చూడాలో వేచి చూడాల్సిందే.
Raj Tarun Lavanya : రాజ్ తరుణ్ – లావణ్య కేసులో లాయర్ కళ్యాణ్ సంచలన విషయాలు