Site icon NTV Telugu

CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ అగ్ర నేతలతో కీలక భేటీ!

Rr

Rr

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ( అక్టోబర్ 25న) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అగ్ర నేతలతో ఆయన కీలక సమావేశం జరిపే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిపాలన, పార్టీ పరిస్థితులపై ప్రధానంగా చర్చించే ఛాన్స్ ఉంది. జిల్లా, పట్టణ కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షుల నియామకంపై జరిగే సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్‌ గౌడ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పాల్గొననున్నారు. కాగా, ఇప్పటికే జిల్లా, పట్టణ కాంగ్రెస్‌ కమిటీలకు అధ్యక్షుల ఎంపికపై, జిల్లా పర్యటనలు ఏఐసీసీ పరిశీలకులు చేశారు.

Exit mobile version