Site icon NTV Telugu

CM Revanth Reddy: కుల గణన సర్వేపై సీఎం రేవంత్ సమీక్ష.. త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక!

Cm Revanth

Cm Revanth

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సమగ్ర కుల గణన సర్వేపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కులగణన ద్వారా ఇంటింటికి వెళ్లి సర్వే చేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని సీఎం అన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ సర్కార్ చేపట్టిన సర్వేపై ప్రశంసలు అందుతున్నాయని చెప్పుకొచ్చారు. సర్వే విజయవంతంగా చేపట్టిన అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. సర్వేకు సంబంధించిన ముసాయిదా సిద్దమయిందని.. ఒకటి రెండు రోజుల్లో సమర్పిస్తామని అధికారులు తెలిపారు. అయితే, పూర్తి నివేదికను మాత్రం ఫిబ్రవరి 2వ తేదీ లోగా కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు చెప్పారు.

Read Also: Minister Kolusu Parthasarathy: వైసీపీ ఖాళీ అవుతోంది.. నంబర్‌ 2లు కూడా వెళ్లిపోయారు.

అయితే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు పలు కీలక శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే, పంచాయతీ రాజ్ శాఖపై సమీక్షించిన సీఎం.. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు పర్యాటక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అలాగే, సాయంత్రం 6 గంటలకు దేవాదాయ శాఖపై సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖతో పాటు సంబంధిత శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొనే అవకాశం ఉంది.

Exit mobile version