CM Viral Tweet: ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి.. సీఎం ట్వీట్ వైరల్..
- తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి..
- సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ ఖాతాలో ఆశక్తికర పోస్ట్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Viral Tweet: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తైన సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ ఖాతాలో ఆశక్తికర పోస్ట్ చేశారు. ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి… సమస్త ప్రజల ఆకాంక్షలు… సంపూర్ణంగా నెరవేర్చడమే నా సంప్రాప్తి అని సీఎం తెలిపారు. పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను… ఆత్మబలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలను…అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి… డిసెంబర్ 7, 2023 నాడు…తెలంగాణ నా చేతుల్లో పెట్టిందని తెలిపారు. తన వారసత్వాన్ని సగర్వంగా… సమున్నతంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను అప్పగించిందని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Also Read
ఆక్షణం నుండి… జన సేవకుడిగా… ప్రజా సంక్షేమ శ్రామికుడిగా… మదిలో, విధిలో, నిర్ణయాల జడిలో… సకల జనహితమే పరమావధిగా… జాతి ఆత్మగౌరవమే ప్రాధాన్యతగా… సహచరుల సహకారంతో… జనహితుల ప్రోత్సాహంతో…విమర్శలను సహిస్తూ… విద్వేషాలను ఎదురిస్తూ…స్వేచ్ఛకు రెక్కలు తొడిగి… ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచి…అవనిపై అగ్ర భాగాన …తెలంగాణను నిలిపేందుకు…గొప్ప లక్ష్యాల వైపు నడుస్తూ…నాలుగు కోట్ల ఆశయాలను నడిపిస్తూ…నిరంతరం జ్వలించే …ఈ మట్టి చైతన్యమే స్ఫూర్తిగా… విరామం ఎరుగక… విశ్రాంతి కోరక…ముందుకు సాగిపోతున్నానని సీఎం తెలిపారు.
Ministers Tummala: అలా చేయడం వల్లనే మున్నేరు వరద ముంపు గండం..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?