Akbaruddin Owaisi: ఓల్డ్ సిటీ అందమైన నగరం.. ఒలింపిక్స్‌లో మెడల్స్ తెచ్చే ప్లేయర్స్ ఉన్నారు
- ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
- ఓల్డ్ సిటీ అందమైన నగరం.. ఒలింపిక్స్‌లో మెడల్స్ తెచ్చే ప్లేయర్స్ ఉన్నారు
- ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓల్డ్ సిటీ చాలా అందమైన నగరమని.. ఇక్కడ ఉండే ప్రజలంతా ప్రేమానురాగాలతో ఉంటారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఆరాంఘర్ ఫ్లై ఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అక్బరుద్దీన్ పాల్గొని ప్రసంగించారు. ‘‘ఓల్డ్ సిటీలో ఇంత పెద్ద ఫ్లై ఓవర్ ప్రారంభించడం ఆనందంగా ఉంది. రూ.301 కోట్లతో శివరేజ్ పనులు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. వర్షం నీరు, మురుగు నీరు కలవకుండా వేర్వేరు లైన్ ఏర్పాటు చేయడం సంతోషం. మురుగు నీరును కూడా బాగు చేయడానికి ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారని.. దీంతో మూసీలో మురుగు లేకుండా చేయడానికి అవకాశం కలుగుతుంది.’’అని వివరించారు.
ఇది కూడా చదవండి: HMPV Virus: HMPV వైరస్ భయం వద్దు.. చేయాల్సినవి, చేయకూడని పనులు ఇవే..
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్‌కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
గత ప్రభుత్వం ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్, సింగపూర్ చేస్తామని అన్నారని.. కానీ చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. ఓల్డ్ సిటీకి ప్రతి రోజు వేల సంఖ్యలో టూరిస్ట్‌లు వస్తారని.. ఓల్డ్ సిటీని మరింత డెవలప్ చేస్తే టూరిజం మరింత పెరిగే అవకాశం ఉందని సూచించారు. ప్రభుత్వం తీసుకొస్తామన్న టూరిజం పాలసీలో మక్కా మసీదుతో పాటు ఇతర మసీదులను కూడా చేర్చితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఓల్డ్ సిటీలో కూడా హైరేంజ్ అపార్ట్‌మెంట్ కల్చర్ వస్తుందన్నారు. కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రిపై ప్రభుత్వం దృష్టిసారించి త్వరగా పూర్తి చేయాలని కోరారు. సిటీలో ఉన్న స్టేడియాలను పొలిటికల్ పార్టీ మీటింగ్స్ ఇవ్వకుండా స్పోర్ట్స్‌ను పెంచే విధంగా ఉండాలన్నారు. ఓల్డ్ సిటీ నుంచి ఒలంపిక్స్‌లో మెడల్స్ తీసుకువచ్చే ఫుడ్ బాల్ ప్లేయర్స్ ఉన్నారని.. వారికి ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. ఓల్డ్ సిటీలో హిందూ- ముస్లిం అనే తేడా లేకుండా కలిసిమెలిసి ఉంటారన్నారు. ఓల్డ్ సిటీకి మెట్రో రైలు తీసుకొస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి అక్బరుద్దీన్ ధన్యవాదాలు తెలిపారు.
తాజావార్తలు
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?