Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇవాళ విచారణ ప్రారంభించనుంది. ఘోష్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లోని కమిషన్ కార్యాలయంలో విచారణ జరగనుంది. విచారణలో భాగంగా పలువురు అధికారులు, ఇంజినీర్లు, ప్రైవేటు వ్యక్తులకు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. రెండు వారాల పాటు విచారణ కొనసాగనుంది.
Read also: Kolkata Doctor Case: ఆందోళనకు ఐఎంఏ పిలుపు.. ఇందిరాపార్కులోని ధర్నాచౌక్ వద్ద ధర్నా..
కాళేశ్వరం లిఫ్టుల్లో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై రేవంత్ సర్కార్ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విచారణ కమిషన్ కాళేశ్వరం విచారణను వేగవంతం చేసింది. దీంతో కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ శుక్రవారం (ఆగస్టు 16) హైదరాబాద్ చేరుకున్నారు. విచారణ వేగవంతం చేయాలనే ఉద్దేశంతో రెండు వారాల పాటు హైదరాబాద్ లోనే మకాం వేయనున్నారు. అంతే కాకుండా సుందిళ్ల అన్నారం వైఫల్యానికి గల కారణాలపై నివేదిక ఇవ్వనందుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ (వీ అండ్ ఈ)కి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ (ఎన్‌డిఎస్‌ఎ) చైర్మన్‌కు కూడా సమన్లు జారీ చేసే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
Read also: Rishab Shetty : తనకు వచ్చిన జాతీయ అవార్డును వారికి అంకితం ఇచ్చేసిన రిషబ్ శెట్టి.!
మేడిగడ్డ బ్యారేజీలు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై పదేపదే కోరినప్పటికీ విచారణ నివేదికను జాప్యం చేసింది. నివేదికలు సమర్పించాలని అనేకసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో సంస్థలను పిలిపించి విచారించాలనే నిర్ణయానికి వచ్చాడు. అఫిడవిట్లు దాఖలు చేసిన మాజీ ఐఏఎస్ అధికారులతో పాటు సర్వీస్‌లో ఉన్న సీనియర్ ఐఏఎస్‌ల క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను కూడా జస్టిస్ పినాకి చంద్రఘోస్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై కూడా దృష్టి సారించనున్నారు. మూడు డ్యాంల నిర్మాణంలో 50 మందికి పైగా సబ్ కాంట్రాక్టర్లు ఉన్న సంగతి తెలిసిందే.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?