NTV Telugu Site icon

Cyber Crime: హైదరాబాద్లో వెలుగు చూసిన కాల్ సెంటర్ స్కాం..

Call Center

Call Center

Cyber Crime: హైదరాబాద్ నగరంలో కాల్ సెంటర్ల స్కాం వెలుగులోకి వచ్చింది. పే పాల్ వినియోగిస్తున్న కస్టమర్స్ డేటా చోరీ చేసినట్లు గుర్తించారు. విదేశాల్లో ఉంటున్న కస్టమర్స్ టార్గెట్ గా ఈ స్కాం చేశారు. దీంతో పాటు హ్యాక్ అయిన బ్యాంకు ఖాతాలను సరిచేస్తామంటూ మోసాలు చేసి.. బ్యాంకు అకౌంట్, డెబిట్, క్రెడిక్ కార్డులు వివరాలు సేకరంచి ఖాతాల్లో నగదు కాజేస్తున్నారు నిందితులు. ఇక, ఈ కాల్ సెంటర్ పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సోదాలు చేసి సుమారు 50 మందిని అదుపులోకి తీసుకుంది. అలాగే, భారీగా కంప్యూటర్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది.

Read Also: Malala: 13 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై అడుగుపెట్టిన నోబెల్ గ్రహీత మలాలా

కాగా, హైటెక్ సిటీలోని పత్రికా నగర్ అడ్డాగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తెలిపారు. 63 మంది సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నాం.. ఎక్కువ మంది నార్త్ ఈస్టర్న్ దేశాలకు చెందిన వాళ్ళు ఉన్నారు.. అమెరికాకి చెందిన పే పాల్ అనే యాప్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.. అధునాతన సాప్ట్ వేర్ EYEBEAM, X-LITE ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. విదేశాల్లో ఉన్న వాళ్ళే టార్గెట్ గా చేసుకుని ఫిషింగ్ మెయిల్స్ పంపుతున్నారు.. ఫ్రాడ్ ప్రివెన్షన్ టీమ్ అని చెప్పుకుంటూ కాల్స్ చేస్తున్నారు.. 63 మందిలో 22 మంది అమ్మాయిలు ఉన్నారు.. సోషల్ మీడియాలో ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చి రిక్రూట్ చేసుకున్నారు అని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ పేర్కొనింది.

Read Also: Daggubati Venkateswara Rao: నాకు, చంద్రబాబుకు వైరం ఉంది నిజమే!

ఇక, ఎలా సైబర్ నేరాలకు పాల్పడాలో కూడా శిక్షణ ఇచ్చారు అని సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది. Exito సొల్యూషన్స్ ఎండీ చందా మనస్వనినీ అరెస్ట్ చేశాం.. నెట్వర్క్ ను ఆపరేట్ చేస్తున్న జాదు భాయ్, రాహుల్ అలియాస్ ప్రతిక్ ను కూడా ఉన్నారు.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లింక్డ్ ఇన్, ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్ ద్వారా యువతీ, యువకులను రిక్రూట్ చేసుకున్నారు.. కాల్ సెంటర్ లో ఉద్యోగాల పేరుతో వారిని నియమించుకున్నారు.. ఒక్కొకరికి రూ. 30 వేల జీతం ఇచ్చారు.. 52 మొబైల్ ఫోన్స్, 63 ల్యాప్ టాప్స్, 27 ఐడీ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు.