Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Brs Working President Ktr Clarification On Free Bus Woman Passengers

KTR: అక్కచెల్లమ్మలపై ఆ ఉద్దేశం లేదు.. కేటీఆర్‌ ట్వీట్‌ వైరల్‌..

Published Date :August 16, 2024 , 9:02 am
By Bhanu
  • మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను..
  • నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు..
KTR: అక్కచెల్లమ్మలపై ఆ ఉద్దేశం లేదు.. కేటీఆర్‌ ట్వీట్‌ వైరల్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

KTR: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో వివరణ ఇచ్చారు. నా వ్యాఖ్యలు మహిళలను బాధపెట్టి ఉంటే క్షమించండి అన్నారు. పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని తెలిపారు. నా సోదరీమణులను అవమానించే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదని కేటీఆర్ అన్నారు. బస్సుల్లో సీట్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం ఇంకా బస్సులను పెంచాలనే ఉద్దేశంతో అన్నానని తెలిపారు. బస్సుల్లో అల్లం, వెల్లుల్లి పొట్టులు తీసుకుంటే తప్పేంటని మంత్రి సీతక్క అన్న మాటలకు కేటీఆర్ రిప్లై ఇచ్చానని తెలిపారు. బస్సుల్లో ఆడవాళ్లు కొట్టుకుంటుంటే సీతక్కకు కనపడలేదా? అని ప్రశ్నించానని అన్నారు. మరిన్ని బస్సులు పెంచాలని డిమాండ్ చేశామని తెలిపారు. బస్సుల సంఖ్య పెంచిన తర్వాత అవసరమైతే బ్రేక్ డ్యాన్స్, రికార్డ్ డ్యాన్స్ చేద్దాం.. మాకేంటి అంటూ కేటీఆర్ మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నా సోదరీమణులను అవమానించే ఉద్దేశం నాకులేదని కేటీఆర్ ఎక్స్ వేదికగా క్షమాపనలు కోరారు.

Read also: Ascaris Lumbricoides: నులి పురుగులతో ఇబ్బందులా..? ఇలా చేయండి విముక్తి పొందండి..

సీతక్క ఫైర్..

తెలంగాణ మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్ లు, రికార్డింగ్ డాన్స్ లు చేసుకోవచ్చు అని కేటీఆర్ అత్యంత జుగుప్సకరంగా మాట్లాడారని ఆమె మండిపడ్డారు. మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్? అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్స్ లు చేస్తున్నారా? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదని, మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు మంత్రి సీతక్క. బేషరతుగా కేటీఆర్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల అని ఆమె డిమాండ్‌ చేశారు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా బ్రేక్ డాన్సులు చేసుకోండి అనడం మీ బుర్రలో వున్న బురదకు నిదర్శనమని, గత పది సంవత్సరాలు హైదరాబాద్లో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది అని మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు.
Nagarjuna Sagar: సాగర్‌ కు కొనసాగుతున్న వరద.. 4 గేట్లు తెరచి నీటి విడుదల

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS Party
  • free bus
  • ktr
  • telangana
  • Woman Passengers

తాజావార్తలు

  • Harassment: పైలట్ ట్రైనింగ్ కోసం వచ్చిన యవతి పై శిక్షణ ఇన్స్పెక్టర్ అత్యాచారం..

  • Allu Arjun: అల్లు అర్జున్ పుట్టినరోజున అదిరిపోయే అప్‌డేట్స్.. ‘AA22’ టైటిల్ ఫిక్స్?

  • Vaibhav vs Bumrah: “ఇలా ఉన్నావేంట్రా”.. బుమ్రాకే చుక్కలు చూపించిన వైభవ్.. చరిత్రలో నిలిచిపోయే యంగ్ స్టార్ ఫైట్!

  • Sumanth: మృణాల్‌కు క్షమాపణలు చెప్పిన సుమంత్..!

  • Municipal Ward Delimitation: మున్సిపాలిటీల పునర్విభజన ప్రక్రియకు గడువు పెంచిన సర్కార్..

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions