Nagarjuna Sagar: నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. 4 గేట్లు తెరచి నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 590. అడుగులు కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం.. 312.50 టిఎంసిలు కాగా..
ప్రస్తుత నీటి నిల్వ : 312 టీఎంసీలుగా కొనసాగుతుంది. ఇన్ ఫ్లో : 79,284.క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 79,284..క్యూసెకులుగా కొనసాగుతుంది.
Read also: Anand Mahindra: స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నన్స్ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా..
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టడంతో ఎన్‌ఎస్‌పీ అధికారులు సోమవారం డ్యామ్ క్రెస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదలను నిలిపివేసిన విషయం తెలిసిందే. నాగార్జునసాగర్ ఎగువ నుంచి భారీగా ఇన్ ఫ్లో రావడంతో ఈ నెల 5న క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల ప్రారంభించారు. 5 నుంచి 12 వరకు రోజూ 2 నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 8 రోజుల పాటు 175 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఎన్‌ఎస్‌పీ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటలకు క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండగా, వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో క్రస్ట్ గేట్లను క్రమంగా తగ్గించి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు పూర్తిగా నిలిపివేశారు. వరద తీవ్రతను బట్టి క్రస్ట్ గేట్ల ద్వారా మళ్లీ నీటిని విడుదల చేస్తామని ఎనె్‌సపీ అధికారులు తెలిపారు.
Hibiscus Tea: వావ్.. మందార పువ్వుల టీ తాగారా.? తాగితే ఇన్ని లాభాలా..?