BJP K.Laxman: మూసీ నివాసితులకు భరోసాగా బీజేపీ ఉంటుంది..
- మూసీ నివాసితులకు భరోసాగా బీజేపీ ఉంటుంది- బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ ..
- మూసీ ప్రక్షాళన కు బీజేపీ వ్యతిరేకం కాదు..
- ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది.. ఇప్పుడు విజయోత్సవాలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP K.Laxman: మూసీ నివాసితులకు భరోసాగా బీజేపీ ఉంటుందని బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ అన్నారు. బీజేపీ మూసి నిద్రలో భాగంగా మలక్ పేట శాలివాహన నగర్ లో నిద్ర చేశారు. ఉదయం కార్యకర్తలతో కలిసి అల్పాహారం సేవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తం అవ్వాలన్నారు. కాదని పేదలతో చెలగాటం ఆడితే మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. మూసీ నివాసితుల ఇండ్లు కూల్చే ప్రయత్నం చేస్తే.. బుల్డోజర్ లకు అడ్డం నిలబడుతామన్నారు. మూసీ ప్రక్షాళన చేయాలంటే అనేక మార్గాలు ఉన్నాయన్నారు. మూసీ నివాసాలపై ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని హెచ్చరిస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కాంట్రాక్టర్ల జేబులు నింపే మార్గాలు అన్వేషిస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే ఈ మూసి ప్రక్షాళన అని తెలిపారు.
Read also: Rammurthy Naidu: నారావారిపల్లెకు రామ్మూర్తి నాయుడి పార్థివదేహం.. నివాళులర్పించిన నేతలు!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
మూసీ ప్రక్షాళన కు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మూసీ శుద్ధీకరణ చేయాలి.. పరిశుద్దంతో ప్రవహించి నల్గొండ, భాగ్యనగర్ ప్రజలకు ఉపశమనం కల్గించాలన్నారు. అందుకు అనేకమైన మార్గాలు ఉన్నప్పట్టికీ.. లక్షా యాభై వేల కోట్లతో మూసీ శుద్ధీకరణ అంటున్నారని తెలిపారు. వారసత్వంగా మూసీ నివాసితులు ఇక్కడ నివసిస్తున్నారని గుర్తుచేశారు. మూసీకి ఇరువైపులా గోడలు నిర్మించి.., ఎస్టీపీ లు ఏర్పాటు చేసి, డ్రైనేజీ వ్యవస్థను మార్చే అవకాశం ఉందన్నారు. కానీ పేదల ఇండ్లు బుల్డోజర్ల తో కూల్చి వేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు అహంకార పూరితంగా మాట్లాడడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. మీ ప్రతాపం పేదల మీదనా అని ప్రశ్నిస్తే.. బీజేపీ నీ కూడా విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రకటించిన గ్యారెంటీల విషయంలో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. అక్కడి మంత్రులే బాహాటంగా విమర్శిస్తున్నారని తెలిపారు.
Read also: Chain Snatchig: పటాన్ చెరులో చైన్ స్నాచింగ్ కలకలం.. తులసి చెట్టుకు పూజ చేస్తుండగా ఘటన..
కర్ణాటక దీన స్థితి చూసి.. హామీలు ఇచ్చి ముందు ఒకటికి రెండుసార్లు అలోంచాలని స్వయంగా ఖర్గేనే అంటున్నాడని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది.. ఇప్పుడు విజయోత్సవాలు చేస్తామని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనికోసం ఈ విజయోత్సవాలు.. ఏం సాధించారని విజయోత్సవాలు చేస్తున్నారు. అని ప్రశ్నించారు. రైతులను నమ్మించి నట్టేట ముంచినందుకు విజయోత్సవాలు జరుపుతారా? అని మండిపడ్డారు. రైతులకు భరోసా పేరు పై 15 ఇస్తామన్నారు ఇవ్వలేదన్నారు. కౌలు రైతులకు, కూలీలకు వర్తింపజేస్తామన్నారన్నారు. కానీ ఒక్క రైతుకు కూడా భరోసా ఇవ్వలేకపోయారన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని మోది 6 వేల రూపాయలు ఇస్తున్నారని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల గోడు వింటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్నారు. ఆరుగాలం కష్టపడి పండిస్తే నెలల తరబడి కొనుగోలు చేసే దిక్కు లేదన్నారు.
Maharashtra: బీజేపీ మాజీ మహిళా ఎంపీపై దాడి.. కుర్చీలు విసురుతూ.. దుర్భాషలాడుతూ(వీడియో)
తాజావార్తలు
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్‌లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్‌లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
ట్రెండింగ్
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!