Site icon NTV Telugu

Eatala Rajendar: ఉగ్ర కుట్రలకు ప్రతిఫలం ఏంటో పాకిస్తాన్ చూసింది..

Etala

Etala

Eatala Rajendar: పహల్గామ్ ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడంతో.. బీజేపీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై తిరంగ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ కిక్కిరిసింది. మువ్వన్నెల జెండాలతో ట్యాంక్ బాండ్ నిండిపోయింది. సమాజంలోని అన్ని వర్గాల పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. భారతదేశం ఎవరి దయా దక్షిణ్యాల మీద లేదన్నారు. భారతదేశ సత్తా ఏందో మోడీ నాయకత్వంలో ప్రపంచానికి చూపాం.. అమరులకు జోహార్లు అర్పిస్తూ భారత్ మాతా కీ జై అన్నారు.

Read Also: Kesari Chapter 2: అంచనాలు పెంచేసేలా ‘కేసరి ఛాప్టర్ 2’ తెలుగు ట్రైలర్

ఇక, నరేంద్ర మోడీ పాలనలో భారత జాతి ప్రపంచంలో తలెత్తుకొని తిరుగుతుంది అని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం అభివృద్ధి చెందుతోంది.. ఉగ్ర కుట్రలకు ప్రతిఫలం ఏంటో పాకిస్తాన్ చూసింది.. మా దేశ సమగ్రతను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తే ఎవ్వరిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని సంకేతాలు పాకిస్తాన్ కు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. మా జాతీ కోసం, మా సార్వభౌమత్వ రక్షణ కోసం ఒక అడుగు కాదు నాలుగు అడుగులు వెనుకకు వేస్తాం అన్నారు. ఉగ్ర కుట్రలను ఉపేక్షించేది లేదు.. పహల్గమ్ మృత వీరులకు ఘన నివాళులు ఆర్పిస్తున్నామని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

Exit mobile version