Site icon NTV Telugu

BC Reservation: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట..

Supreme

Supreme

BC Reservation: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టులో కేసు విచారణలో ఉండగా మళ్లీ ఇక్కడకు ఎందుకు వచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టులో స్టే ఇవ్వడానికి నిరాకరించిందని బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన లాయర్ తెలిపారు.

అయితే, హైకోర్టులో స్టే ఇవ్వాడానికి నిరాకరిస్తే ఇక్కడకు వస్తారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బీపీ రిజర్వేషన్లపై అక్కడికే వెళ్లాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు కేసు డిస్మిస్ అని చెప్పడంతో.. పిటిషనర్ తరపు న్యాయవాది ఈ కేసును వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు.

Exit mobile version