Beerla Ilaiah: హరీష్ రావు ముఖ్యమంత్రి కుర్చీని అగౌరవపరిచేలా మాట్లాడుతున్నారు అని ప్రభుత్వ విప్ బీర్ల ఐల్లయ్య అన్నారు. నిన్న గవర్నర్ ప్రసంగం అడ్డుకునే ప్రయత్నం చేశారు.. తెలంగాణ ప్రజానీకం గమైస్తున్నది.. మీరు ప్రజా ప్రతినిధుల లెక్క వ్యవహరిస్తలేరు పందికొక్కుల్లా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, గవర్నర్, ముఖ్యమంత్రి అంటే మీకు విలువలేదు.. ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టే స్థాయి లేని వారు సీఎం గురించి మాట్లాడుతున్నారు అని విమర్శలు గుప్పించారు. వీళ్ళు పది సంవత్సరాలు చేయని అభివృద్ధిని 15 నెలల్లో చేస్తే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలుస్తలేదు.. మీలా దొంగ దీక్షలు చేయలేదు.. పెట్రోల్ దొరికినా అగ్గిపెట్టె దొరకలేదు అనే విధంగా మేము చేయలే.. ప్రజల ఆదరణ చూసి ఓర్వలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.. నోరు అదుపులో పెట్టుకో.. మీ బలుపు, వాపు మీ దగ్గరే పెట్టుకోండి అని బీర్ల ఐలయ్య చెప్పుకొచ్చారు.
Read Also: Cyclone: కోల్‌కతాకు తుఫాన్ ముప్పు.. మరో 18 రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక
ఇక, హరీష్ రావు తస్మాత్ జాగ్రత్త బిడ్డ.. నిన్ను గ్రామాల్లో తరిమికొట్టే రోజులు ముందు ఉన్నాయని బీర్ల ఐలయ్య తెలిపారు. మీరు చేసిన తప్పులు, అప్పులు సరిదిద్దుకుంటూ వస్తున్నాం.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం.. ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం.. ఇది చూసి ఓర్వలేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు.. ఈరోజు రాష్ట్రం దివాలా తీయడానికి కారణం మీ మామ అల్లుళ్లు.. సిగ్గులేకుండా ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.. ప్రతిపక్ష హోదా నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నారు.. హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: Raja Singh: హిందూ పండుగలు ఎలా జరుపుకోవాలో మీరు చెబుతారా
అలాగే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్టేచర్ గురించి ముందు మాట్లాడింది కేటీఆర్.. సీఎం పదవి కంటే స్టేచర్ ఇంకేమైనా ఉంటుందా అన్నారు.. కేటీఆర్ మీకు నాయకుడు కావొచ్చు.. సీఎం రాష్ట్రానికి పెద్దన్న లాంటి వారు.. తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి కంటే ఇంకేమి స్టేచర్ ఉండదు.. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి.. మీ కుటుంబంలో నాలుగురు పదవులు తీసుకొని వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అని ఆయన ఆరోపించారు. అందుకే ప్రజలు మీ స్టేచర్ ని దింపి.. సీఎంగా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు.. హరీష్ రావు మీ నోరుని అదుపులో పెట్టుకోండి.. ఇష్టనుసరంగా మాట్లాడితే ఇక్కడ ఎవరు చూసుకుంటూ ఊరుకోరు.. 10 ఏళ్లు పందికొక్కులాగా రాష్ట్రాన్ని దోచుకున్న మీరు మాట్లాడుతున్నారా.. ఈ రోజు 18 గంటలు కష్టపడి సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు.. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు జాగ్రత్తగా మాట్లాడాలని అది శ్రీనివాస్ హెచ్చరించారు.