Site icon NTV Telugu

Bandi Sanjay: సురవరం.. నిరంతరం పేదల కోసమే తపించారు

Bandi Sanjay

Bandi Sanjay

సురవరం సుధాకర్‌రెడ్డి.. నిరంతరం పేదల అభ్యున్నతి కోసమే పాటుపడిన నాయకుడు అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి మృతి పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు సంతాపం తెలిపారు. సురవరం సుధాకర్ రెడ్డి మరణం బాధాకరం అన్నారు. సౌమ్యుడు, మృధుస్వభావి, అందరితో కలిసి మెలిసి ఉంటూ నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేసిన నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి అని బండి సంజయ్ కొనియాడారు.

ఇది కూడా చదవండి: US-India: టారిఫ్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్‌లో నూతన రాయబారి నియామకం

తెలంగాణకు చెందిన సురవరం సుధాకర్ రెడ్డి సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి సీపీఐ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి గా పనిచేసి గుర్తింపు పొందడం గొప్ప విషయం అన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. సురవరం ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

రామచంద్రరావు..
ఇక సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సంతాపం తెలిపారు. అనారోగ్యంతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందన్నారు. తెలుగు వ్యక్తి సీపీఐ జాతీయ పార్టీ కార్యదర్శి గా పనిచేయడం జరిగిందని.. జాతీయ పార్టీకి నాయకత్వం వహించారని చెప్పారు. తెలుగు వ్యక్తి ఉన్నత స్థానానికి ఎదిగి గుర్తింపు పొందారని… సౌమ్యుడిగా.. అందరితో కలిసి మెలిసి ఉండేవారని.. గొప్ప మేధావిగా అభివర్ణించారు. వారి మరణం తెలుగు ప్రజలకు తీరనిలోటు అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పనిచేసిన వ్యక్తి అని.. సమాజం కోసం, పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తి అని తెలిపారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: US: న్యూయార్క్‌లో బస్సు బోల్తా.. ఐదుగురు మృతి.. భారతీయులుగా అనుమానం!

కమ్యూనిస్టు దిగ్గజం, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి (83) హైదరాబాద్‌ గచ్చిబౌలి కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణవార్త తెలియగానే పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఇక మరణం పట్ల రాజకీయ ప్రముఖులంతా సంతాపం తెలిపారు.

Exit mobile version