Bandi Sanjay: సురవరం.. నిరంతరం పేదల కోసమే తపించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సురవరం సుధాకర్‌రెడ్డి.. నిరంతరం పేదల అభ్యున్నతి కోసమే పాటుపడిన నాయకుడు అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి మృతి పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు సంతాపం తెలిపారు. సురవరం సుధాకర్ రెడ్డి మరణం బాధాకరం అన్నారు. సౌమ్యుడు, మృధుస్వభావి, అందరితో కలిసి మెలిసి ఉంటూ నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేసిన నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి అని బండి సంజయ్ కొనియాడారు.
ఇది కూడా చదవండి: US-India: టారిఫ్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్‌లో నూతన రాయబారి నియామకం
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
తెలంగాణకు చెందిన సురవరం సుధాకర్ రెడ్డి సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి సీపీఐ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి గా పనిచేసి గుర్తింపు పొందడం గొప్ప విషయం అన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. సురవరం ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
రామచంద్రరావు..
ఇక సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సంతాపం తెలిపారు. అనారోగ్యంతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందన్నారు. తెలుగు వ్యక్తి సీపీఐ జాతీయ పార్టీ కార్యదర్శి గా పనిచేయడం జరిగిందని.. జాతీయ పార్టీకి నాయకత్వం వహించారని చెప్పారు. తెలుగు వ్యక్తి ఉన్నత స్థానానికి ఎదిగి గుర్తింపు పొందారని… సౌమ్యుడిగా.. అందరితో కలిసి మెలిసి ఉండేవారని.. గొప్ప మేధావిగా అభివర్ణించారు. వారి మరణం తెలుగు ప్రజలకు తీరనిలోటు అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పనిచేసిన వ్యక్తి అని.. సమాజం కోసం, పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తి అని తెలిపారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: US: న్యూయార్క్‌లో బస్సు బోల్తా.. ఐదుగురు మృతి.. భారతీయులుగా అనుమానం!
కమ్యూనిస్టు దిగ్గజం, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి (83) హైదరాబాద్ గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణవార్త తెలియగానే పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఇక మరణం పట్ల రాజకీయ ప్రముఖులంతా సంతాపం తెలిపారు.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!