Banjara Hills: హైదరాబాద్ లో పబ్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 4లో టాస్ పబ్‌పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీలో భాగంగా పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు విరుద్దంగా యువతులతో పబ్‌లో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. పబ్ లోకి వెళ్లిన పోలీసులు వారందరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సుమారు 142 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. నిర్వాహకులు పబ్‌కు కస్టమర్లను ఆకర్షించేందుకు 42 మంది యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. అశ్లీలంగా డ్యాన్సులు చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారని తెలిపారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు పబ్‌పై కేసు నమోదు చేశారు. దాడి చేసిన సమయంలో పబ్‌లో మెుత్తం 100 మంది యువకులు… 42 మంది మహిళలు వున్నట్లు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు వెల్లడించారు.
Read also: Karmayogi Saptah: నేడు నేషనల్ లెర్నింగ్ వీక్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
పబ్ నిర్వాహకులు ఈ యువతులను పబ్ కు వచ్చే కస్టమర్లకు ఎరగా వేస్తున్నారని తెలిపారు. వచ్చే కస్టమర్లతో చనువుగా ఉంటూ వారితో డాన్సులు చేస్తూ పబ్ కు ఆకర్షించే విధంగా వారితోపాటు మద్యం సేవిస్తున్నట్లు నటిస్తున్నారని అన్నారు. కస్టమర్లకు మద్యం ఇచ్చి.. మహిళలు మాత్రం కూల్ డ్రింక్స్ తాగుతూ ట్రాప్ చేస్తున్నట్లు గుర్తించారు. కానీ కస్టమర్ లతో మాత్రం మద్యం తాగుతున్నట్లు నమ్మిస్తారని తెలిపారు. చివరిగా వారి బిల్లులోనే యువతులు తాగిన బిల్లును కలిపి కస్టమర్ల జేబులకు చిల్లుపెడుతున్నారని పోలీసులు తెలిపారు. మద్యానికి బానిసయ్యే విధంగా యువకులను ట్రాప్ చేసి వారి వద్దనుంచి డబ్బులు దండు కుంటున్నారని తెలిపారు. ఇది తెలియని యువకులు పబ్ కి వెళ్లి వారి ట్రాప్ లో పడి జేబులకు చిల్లు వేసుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా యువత పబ్ కల్చర్ మారాలని సూచించారు. మహిళల ద్వారా వారి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. టాస్ పబ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
IND vs NZ: ఓటమి ఉచ్చులోనే భారత్.. ఈరోజు నిలబడితేనే..! ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే