CM Revanth Reddy: హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్ ముగింపు సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సమ్మిట్ లో మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉంది.. తెలంగాణకు ఎంతో ఘన చరిత్ర ఉందన్నారు.. అయితే, గత పదేళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు.. అందుకే కాంగ్రెస్ పాలన మీద ప్రజలు ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకున్నారని తెలిపారు. ఇక, రూ. 20 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేశాం.. దేశంలోనే ఇది పెద్ద నిర్ణయం.. రైతు భరోసా పేరుతో రూ. 12000 ఎకరాకు ఇస్తున్నాం.. ఉపాధి హామీ కార్డు దారులకు సాయం చేస్తున్నాం.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమాజంలోని ప్రతి ఒక్కరి ఆకాంక్షలు నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. భారత దేశ చరిత్రలోనే అతి పెద్ద సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నాం.. రూ. 20,617 కోట్లతో రుణమాఫీ చేశాం.. 24/7 ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.. లక్షల మంది రైతులను రుణ విముక్తుల్ని చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Read Also: MIB: ‘‘రక్షణ కార్యకలాపాల కవరేజ్‌ని ఆపేయండి’’.. మీడియాకు కేంద్రం కీలక ఆదేశాలు..
అలాగే, రైతులు మద్దతు ధర కోసం గతంలో ఆందోళనలు చేసేవారు అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కానీ, మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్దతు ధరతో పాటు ధాన్యానికి క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తున్నాం.. ఇక, ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో విద్యార్థులది కీలక పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు. కానీ, వారికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. తొలి ఏడాదిలోనే 60 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం.. 5 లక్షల యువతకు రాజీవ్ యువ వికాసం అమలు చేస్తున్నాం.. ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకుని దాని ప్రకారం ముందుకెళ్లడం కాంగ్రెస్ పార్టీ విధానం అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Harsha Kumar: ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు.. ఘటనా స్థలంలో బహిరంగసభ..
తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వానించాం.. దావోస్ నుంచి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చాం.. మహిళలను కోటీశ్వరులను చేయడమే మా అజెండాగా పెట్టుకున్నాం.. మహిళా పారిశ్రామిక వేత్తలను బడా పారిశ్రామిక వేత్తలుగా చేయాలని ఆలోచనతో ముందుకెళ్తున్నాం..ఆర్టీసీలో మహిళలు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం.. రాజీవ్ ఆరోగ్య శ్రీ 10 లక్షల వరకు పరిధి పెంచాం.. ఏడాదిలో రూ. 1000 కోట్లు ఖర్చు చేశాం.. మూసి నదిని పునరుజ్జీవం చేసేందుకు కృషి చేస్తున్నాం.. మూసి పెద్ద ఎట్రాక్షన్ కాబోతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.
