Agniveer Recruitment Rally: ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనుకునే రాష్ట్ర యువతకు శుభవార్త. తెలంగాణలో అగ్నివీరుల రిక్రూట్‌మెంట్ ర్యాలీ తేదీలు, వేదిక ఖరారయ్యాయి. డిసెంబర్ 8 నుంచి 16 వరకు హైదరాబాద్, గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ర్యాలీలు నిర్వహించబడుతుందని రిక్రూట్‌మెంట్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 33 జిల్లాల నుంచి అభ్యర్థులు ర్యాలీలో పాల్గొంటారని తెలిపారు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్ విభాగాల్లో 10వ తరగతి ఉత్తీర్ణత, 8వ తరగతి ఉత్తీర్ణత అనే విభాగాల్లో ర్యాలీ నిర్వహించనున్నట్లు వివరించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి నుండి మహిళా మిలిటరీ పోలీసు (డబ్ల్యుఎంపి) పోస్టుల కోసం అభ్యర్థులు అన్ని పత్రాలను ర్యాలీ స్థలానికి తీసుకురావాలని తెలిపింది. నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుందని స్పష్టం చేశారు. అయితే.. డబ్బులు ఇస్తే రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఉత్తీర్ణత సాధిస్తామని ఎవరైనా చెప్పినా నమ్మవద్దని అధికారులు యువతకు సూచించారు. మోసపూరిత హామీల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉత్తీర్ణత లేదా నమోదు చేసుకోవడానికి సహాయం చేస్తామని హామీ ఇచ్చే ట్వీట్లు లేదా స్కామర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థులను హెచ్చరించింది. అభ్యర్థులకు ఏమైనా సందేహం ఉంటే రిక్రూట్‌మెంట్ కార్యాలయం ఫోన్ నంబర్‌లను 040-27740059, 27740205 సంప్రదించాలని సూచించారు.
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి మగవారికి సూపర్ ఫుడ్ తెలుసా..