Addanki Dayakar: కేటీఆర్ నీ పొలిటికల్ డ్రామాలు ఆపాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ హితువు పలికారు. మీరు పవర్ కోసం రాజకీయంగా దిగజారడం మంచిది కాదని ఫైర్ అయ్యారు. మీరు అధికారం కోసం ఎవరినైన వదిలిపెట్టరని అన్నారు. ఎవరి పైననైన దాడులు చేస్తారని అర్థం అయిందన్నారు. మీ రాజకీయం కోసం పొలిటికల్ గా ఎవరినైన వాడుకుంటారన్నారు. అధికారులపై దాడులు చేయడం దేశం మొత్తం చర్చ జరుగుతుందన్నారు. మీరు రాజకీయాలకు తెలంగాణ ప్రతిష్ట దిగజార్చకండి అన్నారు. మీ రాజకీయాలకు తెలంగాణ ప్రజలు చరమ గీతం పాడుతారన్నారు. రైతుల పేరు మీద గుండాలను పంపించి దాడులు చేయించారని మండిపడ్డారు. రైతుల మీద కేసులు పెట్టొద్దని ప్రభుత్వం చెప్పింది, వాళ్ళమీద కేసులు పెట్టలేదన్నారు. దాడులకు పురిగొల్పిన వాళ్లు, కారణమైన అల్లరి మూకలపై మాత్రమే కేసులు పెట్టారన్నారు. ఇప్పటి కైన పొలిటికల్ డ్రామాలు ఆపాలని కేటిఆర్ కు హితువు పలికారు.
Thummala Nageswara Rao: రూ.2 లక్షలకు పైబడిన వాళ్ళ రుణమాఫీ పై త్వరలోనే ప్రకటన చేస్తాం..