Hyderabad Crime: నాచారం పీఎస్ పరిధిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య ఘనంగా నగరంలో కలకలం రేపుతుంది. సంవత్సరం కాలంగా నాచారంలోని హాస్టల్ లో ఉంటున్న వెస్ట్ బెంగాల్ కు చెందిన విద్యార్థిని సంజీమా నిన్న సాయత్రం హాస్టల్ రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో హాస్టల్ లో వున్న విద్యార్థులు యజమానికి తెలియజేయడంతో హాస్టల్ నిర్వాహకులు షాక్ కి గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంజీమా మృతదేహాన్ని గాంధీకి తరలించారు. సంజీమా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సంజీమా సంవత్సరం కాలంగా హాస్టల్ లో అందరికితో బాగానే ఉంటుందని పోలీసులకు హాస్టల్ నిర్వాహకులు తెలిపారు. తన రూంలో మిగతా వారు ఏక్కడి వెళ్లారు, వారి ద్వారా సంజీమా ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. సంజీమాకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ వున్నాడా? తనకు సంబంధించిన వారు బంధువులు హైదరాబాద్ లో వున్నారా? అనే విషయమై ఆరా తీస్తున్నారు. నర్సింగ్ లో ఏమైన సమస్యలు ఉంటే హాస్టల్ వచ్చి ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. సంజీమా మృతిపై కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
Telangana Leads: పట్టుమని పదేళ్లు కూడా లేదు.. కానీ ధనిక రాష్ట్రాల్లో 2వ స్థానం..