Yadadri Bhuvanagiri: బీర్లతో వెళ్తున్న లారీ బోల్తా.. ఎగబడ్డ మందుబాబులు..
- యాదాద్రి భువనగిరి జిల్లాలో బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీ ప్రమాదం..
- బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలో బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లక్కారం స్టేజీ సమీపంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ ఆగి ఉంది. ఈ క్రమంలో మరో లారీ వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఈ రెండు లారీల్లో ఒకటి ఉల్లిపాయలు… మరొకటి బీర్లు లోడు. ఈ ప్రమాదం కారణంగా రెండు ట్రక్కుల సరుకు రోడ్డుపై పడిపోయింది. బీరు బాటిళ్లు, ఉల్లిపాయలు రోడ్డుపై పడిపోవడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో వాటిని తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. ఇక మందు బాబులు బీరు సీసాలు తెచ్చుకునేందుకు రోడ్డంతా నిండిపోయారు.
Read also: CM Revanth Reddy: నేడు రంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..
Also Read
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
- Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
- KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
- Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
ఈ క్రమంలో ఆ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ మృతదేహాన్ని వెలికితీశారు. ట్రాఫిక్ జామ్‌ను తొలగించే ప్రయత్నం చేశారు. మొత్తానికి వివిధ రకాల సరుకులు తీసుకెళ్తున్న వాహనాలు ప్రమాదానికి గురై చాలా మంది గాయాలపాలవుతున్నారు. ఒక్కోసారి పెట్రోల్, డీజిల్ కోసం తీసుకుని వెళ్లేందుకు వెళ్లిన స్థానికులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలూ ఉన్నాయి. గతంలో ఓ ప్రాంతంలో పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో స్థానికులు అందులో ఉన్న పెట్రోల్‌ను తీసుకెళ్లేందుకు ఎగిరిపడ్డారు. ఈ క్రమంలో అక్కడ మంటలు చెలరేగి..దాదాపు 150 మంది చనిపోయారు. అదేవిధంగా మరో ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడిన ప్రమాదంలో 42 మంది మృతి చెందారు. ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది సహాయం చేయడం మానేసి సరుకుల కోసం ఎగడబడటం మరికొందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదిఏమైనా బీర్లు మాత్రం రోడ్డు పై పడటంతో మందుబాబులు ఎగబడ్డారు.
CM Chandrababu: నేడు శ్రీశైలం, సత్యసాయి జిల్లాలో సీఎం పర్యటన..
తాజావార్తలు
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..