Diwali Special Trains: దీపావళికి 804 ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికుల కోసం UTS మొబైల్ యాప్..
- దీపావళికి ఇంటికి వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్..
- 804 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు..
- అన్రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణించే వారి కోసం U.T.S. మొబైల్ యాప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diwali Special Trains: దీపావళికి ఇంటికి వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి, ఛత్ పండుగలను పురస్కరించుకుని అధికారులు 804 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. అన్రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణించే వారికి.. U.T.S. మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రైల్వే శాఖ కోరింది. గత సీజన్లో 626 ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా ఈ సీజన్లో 178 సర్వీసులను పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీలకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దీపావళి, ఛత్ పండుగల నేపథ్యంలో అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించారు. కాగా.. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి షాలిమార్, రాక్సల్, జయపుర, హిస్సార్, గోరఖ్‌పూర్, షిర్డీ, దానాపూర్, నిజాముద్దీన్, కటక్, అగర్తల, సంత్రాగచ్చిలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
Read also: Kaleshwaram: కాళేశ్వరం అవకతవకలపై నేటి నుంచి మళ్లీ విచారణ..
Also Read
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పండుగల సందర్భంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. మరోవైపు మదురై, ఈరోడ్, నాగర్‌కోయిల్, కొల్లాం, బెంగళూరు, పన్వెల్, దాదర్ తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రత్యేక రైళ్లలో రిజర్వ్డ్ కోచ్‌లు, అన్రిజర్వ్డ్ కోచ్‌లు ఉన్నాయని తెలిపింది. మరోవైపు దానా తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే 41 రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 23, 24, 25, 27 తేదీల్లో వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ వెల్లడించారు. రద్దయిన రైళ్ల వివరాలను సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. రద్దయిన రైళ్లలో ఎక్కువ భాగం హౌదా, భువనేశ్వర్, ఖరగ్‌పూర్ (పశ్చిమ బెంగాల్), పూరి మరియు ఇతర ప్రాంతాల నుండి ఉన్నాయి.
KTR Testimony: మంత్రి కొండా సురేఖపై కేసులో.. నేడు కేటీఆర్ వాంగ్మూలం..
తాజావార్తలు
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!