Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ నేటి నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను పునఃప్రారంభించనుంది. ఈ నెల 29 వరకు జరిగే ఈ బహిరంగ విచారణకు పలువురు ఇంజినీర్లు, అధికారులు, రిటైర్డ్ అధికారులు హాజరుకావాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ వ్యవహారాలను కళ్లారా చూసిన ఐఏఎస్ అధికారులను కూడా ఈ నెలాఖరున విచారణకు పిలిచారు. ఇప్పటికే అఫిడవిట్లు సమర్పించిన తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాష్ సహా పలువురిని జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. మరోవైపు రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ డైరెక్టర్ జనరల్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి మంగళవారం ఉదయం జస్టిస్ ఘోష్ తో గంటపాటు చర్చించారు.
Read also: Goat Milk Benefits: అయ్యా బాబోయ్.. మేక పాల వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా
తుది నివేదికను వెంటనే సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. వీలైనంత త్వరగా కమిషన్ కు అవసరమైన డాక్యుమెంట్ల వివరాలను అందజేస్తామని విజిలెన్స్ డీజీ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. సెప్టెంబరు చివరి వారంలో క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తికావడంతో బ్రేక్ ఇచ్చిన జస్టిస్ ఘోష్.. మళ్లీ ప్రక్రియను కొనసాగించనున్నందున మంగళవారం నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఏ రోజు ఎవరిని పిలవాలనే దానిపై చర్చించి షెడ్యూల్ ఖరారు చేసే పనిలో పడ్డారు. గతంలో నీటిపారుదల శాఖ కార్యదర్శులుగా ఉన్న బ్యూరోక్రాట్‌లు ఎస్‌కే జోషి, రజత్ కుమార్, స్మితా సబర్వాల్, వికాస్ రాజ్, అఫిడవిట్ సమర్పించిన మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ మరియు ఇతరులను జస్టిస్ ఘోష్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తారని కమిషన్ వర్గాలు తెలిపాయి.
Rajanna Sircilla: ఊపిరి ఉండగానే స్మశానంలో పడేశారు.. చివరకు ఏమైందంటే..