54th GST Council Meeting: నేడు 54వ జీఎస్టి కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికపై జీఎస్టీ కౌన్సిల్ ప్రకటన చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ అధికారులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ తరుపునుంచి మల్లు భట్టి విక్రమార్క పాల్గొంటారు.
Read also: Central Team: నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం..
GST కౌన్సిల్ అంతకుముందు ఈ సంవత్సరం జూన్ 22, 2024 న సమావేశమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం, పన్ను శ్లాబులను తగ్గించాలన్న డిమాండ్లు పెరగడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. త్వరలో జరగనున్న జీఎస్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. GST కౌన్సిల్ వస్తువులు మరియు సేవల పన్నుకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రులు ఇందులో సభ్యులు. జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటి వరకు 53 సార్లు సమావేశమైంది. ఇవాళ 54వ సమావేశం ఖరారైంది. ఈ 54వ సమావేశంలో పన్ను రేట్లలో మార్పులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పన్ను శ్లాబులను తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పన్ను నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read also: 16th Finance Commission: నేడు, రేపు రాష్ట్రంలో పర్యటించనున్న 16వ ఆర్థిక సంఘం..
53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ కౌన్సిల్ సమావేశంలో బిహార్ ఉప ముఖ్యమంత్రి సుమంత్ చౌదరి పన్ను శ్లాబుల తగ్గింపుపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే, బీమా పాలసీలపై వస్తు, సేవల పన్నును పూర్తిగా తొలగించాలన్న డిమాండ్లు కూడా పెరిగాయి. బీమా పాలసీని పూర్తిగా ఎత్తివేయడం వల్ల ప్రతి ఒక్కరూ బీమా లక్ష్యాన్ని చేరుకోవడం సులభతరం అవుతుందని, పెరిగిన ప్రీమియం ధరలు పేద, మధ్య తరగతి ప్రజలకు మోయలేని భారంగా మారాయని పలు నివేదికలు చెబుతున్నాయి. 18 శాతంగా ఉన్న జీఎస్టీని పూర్తిగా తొలగించాలని వివిధ వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న జీఎస్టీని తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
CM Revanth Reddy: నేడు సచివాలయంలో వరద నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..