Praja Bhavan: నేడు సీఎం రేవంత్ రెడ్డితో 16వ ఆర్థిక సంఘం భేటీ..
- నేడు ప్రజా భవన్ లో 16వ కేంద్ర ఆర్థిక సంఘం బృందంతో ముఖ్యమంత్రి- ఆర్థిక శాఖ మంత్రి భట్టి భేటి..
- అనంతరం ప్రజాభవన్ లో ఆర్థిక సంఘం మీడియా సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Praja Bhavan: తెలంగాణ రాష్ట్రంలో 16వ ఆర్థిక సంఘం ఇవాళ రెండు రోజులు పర్యటిస్తున్న విషయం తెలిసిందే.. ఈనేపథ్యంలో.. నేడు ఉదయం 10 గంటలకు ప్రజా భవన్ లో 16వ కేంద్ర ఆర్థిక సంఘం బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావులతో భేటి కానుంది. కేంద్రం నుండి రాష్ట్రాలకు రావాల్సిన నిధుల పెంపు విషయంలో ఆర్దిక సంఘాన్ని కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని నిధులు కేటాయించాలని ప్రభుత్వం కోరనుంది. వర్షాలు, కరువులు వచ్చినప్పుడు జాతీయ విపత్తుల నిధులను పెంచాలని విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్రాలకు పన్నుల ఆదాయం విషయంలో కూడా మార్పులు చేయాలని కోరనుంది.
Read also: Heavy Floods: ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి-శబరి నదులు
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
అనంతరం ప్రజాభవన్‌లో అరవింద్ పనగారియా బృందానికి భట్టి విక్రమార్క విందు ఇవ్వనున్నారు. ఆతరువాత ప్రజాభవన్ లో ఆర్థిక సంఘం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 15వ ఆర్థిక సంఘం కింద జీహెచ్ఎంసీకి మంజూరైన నిధుల వినియోగంపై సంస్థ అధికారులు ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు యాదాద్రి భువనగిరి మండలం అనంతారం గ్రామాన్ని సందర్శిస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) పనితీరు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య రంగానికి కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం తదితర అంశాలను పరిశీలిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఇక రేపు (11)వ తేదీ ఉదయం 16వ ఆర్థిక సంఘం తిరిగి వెళ్లిపోనుంది. 2025-26 నుంచి 2030-31 మధ్య కాలంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధుల బదిలీల విషయంలో 16వ ఆర్థిక సంఘం చేయబోయే సిఫార్సులు కీలకం కానున్నాయి. నివేదికను అక్టోబర్ 31, 2025 నాటికి సమర్పించాలి మరియు ఇది ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి వస్తుంది. ఇది రాష్ట్రాల ఆర్థిక వనరులను అంచనా వేసి, దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీలకు అదనపు నిధులను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేస్తుంది.
Haryana Elections: కాంగ్రెస్-ఆప్ మధ్య చెడిందా..? ఆ రాష్ట్రంలో రెండు పార్టీలు ఒంటరిగా పోటీ..
తాజావార్తలు
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటుంది!
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!