హైదరాబాద్ పోలీసులు ఎప్పుడూ ట్రెండ్ ను ఫాలో అవుతారు.. ట్రెండింగ్ లో ఉన్నవాటిని ఆధారంగా చేసుకొని వాహనదారులకు సూచనలు ఇవ్వడంతో పాటుగా చలాన్ లు కూడా విధిస్తారు .. గతంలో పుష్ప డైలాగ్స్ తో ట్రెండ్ చేశారు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హైదరాబాద్ పోలీసులు చేసిన ట్వీట్ ఒకటి తెగ చక్కర్లు కొడుతుంది..
ఇటీవల సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. కుమారి ఆంటీ.. ఆమె చెప్పిన రెండు లివర్లు ఎక్స్ట్రా’ అనే డైలాగ్ ను అందరూ తెగ వాడేస్తున్నారు.. సోషల్ మీడియా సెన్సెషన్ గా నిలిచింది. ఇప్పుడీ డైలాగ్ ను సమయస్ఫూర్తిగా వాడుకున్నారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ సిటీ పోలీస్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అస్సలు విషయం ఏంటంటే..
ఓ ఫ్లైఓవర్ పై ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదు. అంతే కాదు ఫోన్ కూడా మాట్లాడడుతున్నాడు.. ఆ వ్యక్తి ఫోటోను తీసిన పోలీసులు మీది మొత్తం వెయ్యి అయింది.. యూజర్ చార్జెస్ ఎక్స్ ట్రా అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఆ బండి నెంబర్ ను మాత్రం.. కనిపించకుండా చేశారు. వ్యక్తిగతంగా ఆయన బండి నెంబర్ పేరున చలానా క్రియేట్ అయింది… అంటూ ఆ పోస్ట్ ను వైరల్ అయ్యేలా చేశారు హైదరాబాద్ పోలీసులు.. అయితే ఈ ట్వీట్ చేసిన ట్విట్టర్ హ్యాండిల్ ట్రాఫిక్ పోలీసులది కాదు.. హైదరాబాద్ సిటీ పోలీసులది. వెంటనే చాలా మంది.. ట్రాఫిక్ ఉల్లంఘిస్తన్న వాహనాల ఫోటోలు తీసి ఈ ట్వీట్ కు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు.. దీంతో పాటుగా రాంగ్ రూటు లో వస్తున్న వాహనాల ఫోటోలను యాడ్ చేసి మరీ నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.. మొత్తానికి పోలీసులు, నెటిజన్ల మధ్య జరిగిన ఈ ట్వీట్ వార్ ట్రెండ్ అవుతుంది..
Midhi motham 1000 ayindhi, user charges extra…#FollowTrafficRules #BeSafe#CellPhoneDriving pic.twitter.com/9kpxRKP8Ov
— Hyderabad City Police (@hydcitypolice) February 20, 2024