Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్‌ను ముంచేసిన భారీ వర్షం
- హైటెక్ సిటీ, మాదాపూర్, మైండ్‌స్పేస్‌లో స్తంభించిన ట్రాఫిక్
- దుర్గం చెరువు బ్రిడ్జిపై కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
- రంగంలోకి దిగిన HYDRAA.. అయినా తగ్గని ట్రాఫిక్ కష్టాలు
- జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసుల సమన్వయంపై ప్రజల ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hitech City Traffic :హైదరాబాద్ మహానగరాన్ని మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం వణికించింది. కేవలం గంట సేపు పడిన వానకే నగరం మొత్తం అతలాకుతలమైంది. ముఖ్యంగా కోట్లు కురిపించే ఐటీ హబ్ పూర్తిగా స్తంభించిపోయింది. ఆఫీసులు ముగించుకుని ఇళ్లకు బయలుదేరిన వేలాది మంది ఐటీ ఉద్యోగులు, సామాన్య ప్రజలు నడిరోడ్డుపైనే గంటల తరబడి చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చెరువులను తలపించిన ఐటీ రోడ్లు
నగరానికి గుండెకాయ లాంటి హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, ఐక్యా సెంటర్, మాదాపూర్ ప్రాంతాలు నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఏ చెరువునో, కుంటనో తలపించాయి. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గ్లోబల్ సిటీ అంటూ గొప్పలు చెప్పుకునే ఐటీ కారిడార్‌లోని డ్రైనేజీ వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో ఈ వర్షం మరోసారి బయటపెట్టింది. వరద నీరు కొండల్లా పేరుకుపోవడంతో, ఐటీ ఉద్యోగులు ఆకలితో, అలసటతో రోడ్లపైనే మూడు గంటలకు పైగా బందీలయ్యారు.
Also Read
కేబుల్ బ్రిడ్జిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మరోవైపు, నగరంలోనే అత్యంత కీలకమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. వందలాది కార్లు, బైకులు చీమల కంటే దారుణంగా అంగుళం కూడా కదల్లేని స్థితిలో నిలిచిపోయాయి. అక్కడక్కడా కొద్దిమంది కింది స్థాయి పోలీసులు, హైడ్రా (HYDRAA) సిబ్బంది కలిసి రోడ్లపై నిలిచిన నీటిని తొలగించడానికి, ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి చిత్తశుద్ధితో శ్రమించారు. కానీ, వరద ఉధృతి ముందు వారి ప్రయత్నాలు సరిపోలేదు.
అధికారుల సమన్వయ లోపంపై జనం ఆగ్రహం
ఇంత పెద్ద హైదరాబాద్ మహానగరంలో అసలు ‘డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్’ ఉందా లేదా అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్ద అత్యవసర సమయంలో గ్రేటర్ (GHMC) మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థల మధ్య కనీస కమ్యూనికేషన్, సమన్వయం లేకపోవడం స్పష్టంగా కనిపించింది. అధికారుల ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే తాము నడిరోడ్డుపై నరకయాతన అనుభవించాల్సి వచ్చిందని ఐటీ ఉద్యోగులు మండిపడుతున్నారు. కోట్లాది రూపాయల బడ్జెట్ ఉండి, ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తున్న అధికారులు ఇలాంటి సమయంలో ఏసీ గదులకే పరిమితం కావడంపై నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!