Telangana Traffic: నగరంలో 3 గంటలు ట్రాఫిక్ ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పలుచోట్లు అధికారులు మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతోపాటు వాహనాలను దారిమళ్లిస్తున్నారు. ఖైరతాబాద్ చౌరస్తా, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, చింతల్ బస్తీ, లక్డీకపూల్, బషీర్‌బాగ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ చౌరస్తా, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ జంక్షన్, సచివాలయం మార్గాల్లో ఆంక్షలు విధించారు. ఈనేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.
అయితే.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించతలపెట్టిన నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతిచ్చారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు.
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంతో పాటు వెయ్యి మంది నేతలు, కార్యకర్తలు పాల్గొనేందుకు పోలీసులు అనుమతిచ్చారు. దిల్లీలోని ఈడీ కార్యాలయం నుంచి రాహుల్‌గాంధీ బయటకు వచ్చే వరకు శాంతియుతంగా నిరసన తెలపాలని టీపీసీసీ నిర్ణయించింది. దీనిలో భాగంగానే ర్యాలీ చేపట్టనున్నారు. ఈ ర్యాలీలో రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ముఖ్యనేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, మహేశ్వర్‌రెడ్డి, బోసురాజు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ర్యాలీ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ముందస్తుగా పోలీసులు నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 3 గంటల వరకు ఈ ఆంక్షలు దారి మళ్లిస్తున్నారు.
Srinivas Goud: దేశ ప్రజలను చైతన్య పర్చడానికే.. కేసీఆర్ వస్తున్నారు
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!