Cryptocurrency Tragedy: హైదరాబాద్ పాతబస్తీలో విషాదం.. క్రిప్టో నష్టాలతో యువకుడి ఆత్మహత్య

  • క్రిప్టో పెట్టుబడులతో భారీ నష్టాలు
  • మనస్తాపంతో ఇంట్లోనే విషం తాగిన యువకుడు
  • కుటుంబంలో విషాదం.. పాతబస్తీలో కలకలం
  • అవగాహన లేకుండా పెట్టుబడులపై నిపుణుల హెచ్చరిక
Crypto

Crypto

హైదరాబాద్ పాతబస్తీలో క్రిప్టోకరెన్సీ రూపంలో మరో నిండు ప్రాణం బలైంది. వేగంగా డబ్బు సంపాదించాలనే ఆశతో డిజిటల్ కరెన్సీలో పెట్టుబడులు పెట్టిన ఒక యువకుడు, చివరకు భారీ నష్టాలను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఈ విషాద ఘటన నగరంలో కలకలం రేపింది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మహమ్మద్ ఖాన్ అనే యువకుడు అధిక లాభాల కోసం క్రిప్టోకరెన్సీలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాడు. అయితే, మార్కెట్ ఒడిదుడుకుల వల్ల అతడు ఆశించిన ఫలితాలు రాకపోగా, పెట్టిన పెట్టుబడి అంతా ఆవిరైపోయి భారీగా నష్టపోయాడు. కళ్లముందే సంపాదన అంతా కరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహమ్మద్ ఖాన్, ఆ ఆర్థిక భారాన్ని భరించలేకపోయాడు.

PM MODI: ‘‘ మలేషియా ప్రధాని ఎంజీఆర్‌కు పెద్ద అభిమాని’’.. మోడీ పర్యటనలో తమిళ సాంగ్..

భారీ ఆర్థిక నష్టాల వల్ల కలిగిన మానసిక ఆందోళనతో మహమ్మద్ ఖాన్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లోనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. క్రిప్టోకరెన్సీలో సరైన అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల తలెత్తే పరిణామాలకు ఈ ఘటన ఒక హెచ్చరికగా నిలిచింది.

Airport Customs Rules: విదేశాల్లో నుంచి సుంకం లేకుండా ఎంత బంగారం తెచ్చుకోవచ్చు తెలుసా!