Battini Harinath:హైదరాబాద్ చేప మందుగా పేరుగాంచిన బత్తిని హరినాథ్ గౌడ్ మృతి చెందారు. అనారోగ్యంతో హైదరాబాద్ బొలక్ పూర్ పద్మశాలి కాలనీలో ఆయన నివాసంలో పరిస్థితి విషమించడంతో బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. బత్తినీ హరినాథ్ గౌడ్ కు బార్య సునిత్రదేవి, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పాత బస్తీ లోని దూద్ బౌలి కి ప్రాంతానికి చెందిన బత్తిని సోదరులు ఐదుగురు శివరాం, సోమ లింగం, విశ్వనాథ్, హరినాథ్ గౌడ్, ఉమా మహేశ్వర్ వీరిలో ఇప్పటికే ముగ్గురు చనిపోగా బుధవారం హరినాథ్ గౌడ్ మృతి చెందగా విశ్వనాథ్ ఒక్కరే ఉన్నారు. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిని కుటుంబ సభ్యులు చేపమందు పంపిణీ చేస్తారు. చేప ప్రసాదం కోసం తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు నగరానికి వస్తుంటారు.
Read also: Krithi Shetty: కనులవిందు చేస్తున్న బుల్లెట్ బ్యూటీ “క్రితి శెట్టి”..
1847లో హైదరాబాద్ నగరంలో చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. అప్పట్లో వీరన్న గౌడ్ అనే వ్యక్తి ప్రతి మృగశిర కార్తె ముందు రోజు చేప ప్రసాదం పంచేవాడు. ఆయన కుమారుడు బత్తిని శివరామ గౌడ్ మరియు అతని కుమారుడు బత్తిని శంకర్ గౌడ్ ప్రతి సంవత్సరం ఈ ప్రసాదాన్ని అందజేస్తూనే ఉన్నారు. శంకర్ గౌడ్ , సత్యమ్మ దంపతుల ఐదుగురు కుమారులు బత్తిని హరినాథ్ గౌడ్ , బత్తిని ఉమామహేశ్వర్ గౌడ్ , వారి కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. గత 176 ఏళ్లుగా చేపల మందు పంపిణీ చేస్తున్నారు. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా చేప ప్రసాదం పంపిణీ నిలిచిపోయింది. గతేడాది నుంచి చేపల ఆహారం కోసం వచ్చే వారికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బత్తిని హరినాథ్ గౌడ్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
Astrology: ఆగస్టు 24, గురువారం దినఫలాలు