Jubilee Hills Case: దారుణం.. టాటూలా ఉండాలనే మెడపై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసు తెలంగాణలోనే సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పబ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఘటన జరిగి 15 రోజులు కావొస్తున్నా.. నిత్యం కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచార కేసులోని ఆరుగురు నిందితులను పోలీసులు విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ కేసులోని A1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కస్టడి నేటీతో ముగియనుంది. నిందితుల్లో ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే మనవడితోపాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. మొత్తం ఆరుగురిని పోలీసులు విచారిస్తున్నారు.
Also Read
కాగా.. పోలీసులు శనివారం నిందితులందరికి ఉస్మానియాలో పొటెన్సీ పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఐదుగురు మైనర్లను జువెనైల్ హోంకు, సాదుద్దీన్ మాలిక్‌ను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కాగా.. ఈ కేసులో బాధితురాలి మెడికల్ రిపోర్టు కీలకంగా మారనుంది. ఈ మెడికల్ రిపోర్టు ప్రకారం లైంగిక దాడి సమయంలో మైనర్ మెడపై నిందితులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్లు వెల్లడైంది. ఈ సమయంలో మైనర్ లైంగిక దాడికి నిరాకరించడంతో నిందితులు ఆమె మెడపై కొరకడం వంటి దాడికి పాల్పడ్డారు. దీంతో మైనర్ శరీరంపై 12 గాయాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే టాటూలా ఉండాలనే మెడపై కొరికినట్లు నిందితుల వాగ్మాలం ఇచ్చారు. బాలిక ప్రతిఘటించడంతో గాయాలైనట్లు ఒప్పుకున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..