హైదరాబాద్ ఐఐటీ ఎన్నో ఆవిష్కరణలకు వేదికగా మారుతోంది. తాజాగా ప్రమాదాల నివారణకు ఐఐటీ హైద్రాబాద్ క్యాంపస్ లో 5G టెక్నాలజీతో అభివృద్ధి చేసిన V2X డివైస్ ను ప్రదర్శన కార్యక్రమం లో పాల్గొన్నారు ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్. ఐఐటీ డైరక్టర్ మూర్తి. ఈ సందర్భంగా వారు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో పరిశీలించారు.
ప్రమాదల నివారణకు ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసిన V2X టెక్నాలజీ ఎంతో బాగా ఉపయోగపడుతుందన్నారు జయేష్ రంజన్. V2X డివైస్ ను మరింత అభివృద్ధి చేసి అందుబాటు లోకి తేవాలని సూచించారు. V2X టెక్నాలజీని మొబైల్ కు అనుసంధానం చేసే అవకాశం గురించి ఆలోచించాలి. మెరుగైన ఫలితాల కోసం హైదరాబాద్ లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్నారు. టెక్నాలజీ వినియోగం లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంటుందన్నారు జయేష్ రంజన్. విద్యార్ధులు మరిన్ని పరిశోధనలకు ఐఐటీ హైదరాబాద్ కృషిచేస్తోందన్నారు డైరెక్టర్ మూర్తి.