Hyd Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ప్రాణనష్టం, జలమయమైన వీధులు
- అసిఫ్‌నగర్‌లో నాలాలో కొట్టుకుపోయిన మామ, అల్లుడు.. గాలింపు కొనసాగుతుంది
- గచ్చిబౌలిలో గోడ కూలి ఇద్దరు మృతి.. నలుగురికి గాయాలు
- దోమలగూడ, గాంధీనగర్‌లో నీటమునిగిన కాలనీలు.. వర్షం ముంచెత్తిన వీధులు
- బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyd Rains : హైదరాబాద్ నగరంలో ఆదివారం కురిసిన భారీ వర్షం విషాదాన్ని మిగిల్చింది. గంటల వ్యవధిలోనే 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువుల్లా మారి, ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. వర్షం కారణంగా చోటుచేసుకున్న ఘటనలు నగరాన్ని షాక్‌కు గురి చేశాయి. అసిఫ్‌నగర్ అఫ్జల్‌సాగర్ ప్రాంతంలోని మంగారుబస్తీలో దురదృష్టకర సంఘటన జరిగింది. మామ, అల్లుడు కలిసి నాలా దాటే క్రమంలో జారి నీటిలో కొట్టుకుపోయారు. ఇప్పటికీ ఇద్దరి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది.
Mirai : మిరాయ్ భారీ రికార్డు.. ఆ ముగ్గురు హీరోలను దాటేసిన తేజ
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
మరోవైపు గచ్చిబౌలి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న కన్వెన్షన్ హాల్ ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక దోమలగూడ, చిక్కడపల్లి, గాంధీనగర్ వంటి పలు ప్రాంతాల్లో కాలనీలు పూర్తిగా నీటమునిగాయి.
బోడుప్పల్, పీర్జాదిగూడ, పోచారం, నారపల్లి, బషీర్‌బాగ్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్, బేగంబజార్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, గచ్చిబౌలిలో మోస్తరు నుంచి కుండపోత వర్షం పడింది. అప్రత్యాశిత వర్షం కారణంగా జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమై, నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నాయి. నగరంలో వర్షపాతం కొనసాగుతుండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Vijayawada: రీల్స్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. యువకుడిని తిట్టిన సీఐ.. విజయవాడలో ఉద్రిక్తత..!
తాజావార్తలు
-
Loan Apps: అప్పు తీర్చడానికి మరో 10 అప్పులు.. లోన్ యాప్స్ ఊబిలో చిక్కుకుంటున్న కోట్లాది కుటుంబాలు!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
-
King 100: నాగ్100పై సస్పెన్స్‌కు తెర.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్!
-
Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!