Hyderabad Formula -E: ప్రతిష్టాత్మక రూపొందుతున్న ఫార్ములా ఈ రేస్ పోటీలకు హైదరాబాద్ మహానగరం సిద్ధమైంది. ఫిబ్రవరిలో జరిగే ఈ పోటీల కోసం 35వేల మంది ఒకేసారి వీక్షించే విధంగా ముస్తాబవుతుంది.. ఇది దేశంలోనే తొలిసారిగా నగరంలో నిర్వహిస్తున్న ఈ రేసు కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ఫార్ములా ఈ కార్లు దూసుకెళ్లేందుకు వీలుగా ట్రాక్‌లను ఇప్పటికే సిద్ధం చేశారు. అయితే.. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో భాగంగా వీటిని పరీక్షించేందుకు ఈ నెల 19, 20వ తేదీల్లో అలాగే డిసెంబర్ 10, 11వ తేదీల్లో ట్రయల్స్ నిర్వహించ బోతున్నారు. ఇప్పటికే ఇండియన్ రేసింగ్ లీగ్‌లో పరుగులు పెట్టే కార్లు నగరానికి చేరుకున్నాయి. ఈనెల 19,20 తేదీల్లో జరగనున్న ఈపోటీల్లో పాల్గొనేందుకు ఇటలీ నుంచి 13 రేసింగ్ కార్లు నిన్న ఐమ్యాక్స్ పక్కన ప్రత్యేకంగా నిర్మించిన షెడ్లలోకి చేర్చారు. అయితే.. ఫార్ములా ఈ రేసులో ఒక్కో రౌండ్ గెలిచిన విన్నర్‌కు పాయింట్లు కేటాయిస్తారు. ఎఫ్ఐఏ స్కోరింగ్ సిస్టమ్ ఆధారంగా ఒక్కో రౌండ్లో టాప్ వచ్చిన 10 డ్రైవర్లు ఈ పాయింట్లు కేటాయిస్తారు. రేసులో ఫస్ట్ వచ్చిన డ్రైవర్‌కు 25 పాయింట్లు కేటాయిస్తారు. పదో స్థానంలో వచ్చిన డ్రైవర్‌కు ఒక పాయింట్ కేటాయిస్తారు. రెండో స్థానానికి 18 పాయింట్లు, మూడో స్థానానికి 15 పాయింట్లు, నాలుగో స్థానానికి 12 పాయింట్లు, ఐదో స్థానానికి 10 పాయింట్లు, ఆరో స్థానానికి 8 పాయింట్లు, ఏడో స్థానానికి 6 పాయింట్లు, ఎనిమిదో స్థానానికి 4 పాయింట్లు, తొమ్మిదో స్థానానికి 2 పాయింట్లు కేటాయిస్తారు. ఇలా సీజన్ మొత్తం పూర్తయ్యేసరికి ఎవరు ఎక్కువ పాయింట్లు పొందితే వారినే సీజన్ విన్నర్‌గా ప్రకటిస్తారు.
నవంబర్ 16 నుంచి 20 వరకు ట్రాఫిక్ మళ్లింపు
నెక్లెస్ రోడ్డులోని ఐమాక్స్ రోటరీ నుంచి తెలుగుతల్లి జంక్షన్, కొత్త సచివాలయం, ఎన్టీఆర్ గార్డెన్, మింట్ కాంపౌండ్, వెనుకకు వెళ్లే ఎన్టీఆర్ మార్గ్‌లో ఫార్ములా ఇ రేస్‌ను దృష్టిలో ఉంచుకుని నవంబర్ 16 నుంచి 20 వరకు ట్రాఫిక్ మళ్లింపులను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. IMAXకి. ఫార్ములా ఇ రేస్ కారణంగా ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్ మరియు లుంబినీ పార్క్ నవంబర్ 18 నుండి 20 వరకు మూసివేయబడతాయి. నవంబర్ 19, 20 తేదీల్లో వివి విగ్రహం (ఖైరతాబాద్) జంక్షన్, పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ జంక్షన్, రవీంద్ర భారతి జంక్షన్, మింట్ కాంపౌండ్ రోడ్డు, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్ల గుట్ట జంక్షన్, కట్ట మైసమ్మ దేవాలయం (లోయర్ ట్యాంక్) వద్ద ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉంది. స్థానిక పరిస్థితిని బట్టి ఈ క్రింది ట్రాఫిక్ మళ్లింపులు రాబోయే ఐదు రోజులలో అమలులో ఉంటాయి.
వోల్ఫ్ జీబీ 08 థండర్ మోడల్ కార్లు..
హైదరాబాద్‌లో జరిగే రేసింగ్ కోసం వోల్ఫ్ జీబీ08 థండర్ మోడల్ కార్లను వినియోగిస్తున్నారు. ఇటాలియన్ స్పోర్ట్ ప్రోటోటైప్స్ చాంపియన్ షిప్లో గెలిచిన వన్-మేక్ ఫార్ములాలో వినియోగించిన కార్లను ఇక్కడ వినియోగిస్తున్నారు. వోల్ఫ్ రేసింగ్ టీమ్‌లోని నిపుణులు కార్ల నిర్వహణను చేపడుతున్నారు.
ఇండియన్ రేసింగ్ లీగ్‌లో పాల్గొనే జట్లు
ఇండియన్ రేసింగ్ లీగ్‌లో ఆరు నగర ఆధారిత ఫ్రాంచైజీ జట్లు ఉన్నాయి. అయితే.. వీటిలో స్పీడ్ డెమన్స్ ఢిల్లీ, హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్, బెంగుళూరు స్పీడ్ స్టర్స్, చెన్నై టర్బో రైడర్స్, గోవా ఏసెస్ జట్లు ఉన్నాయి. ఇక, హైదరాబాద్‌కు చెందిన జట్టు బ్లాక్ బర్డ్స్‌లో నగరానికి చెందిన అనిందిత్ రెడ్డి కూడా ఉన్నారు. ఈయనతో పాటు స్విస్ ఇండియన్ ప్రొఫెషనల్ పోర్శీ ఫ్యాక్టరీ డ్రైవర్ నీల్ జానీ, ఆస్టన్ మార్టిన్ రేసింగ్ అకాడమీ డ్రైవర్ అఖిల్ రబీంద్ర తో పాటుగా ఫిమేల్ ఎఫ్ 4 రేసింగ్ డ్రైవర్ లోలా లోవిన్ ఫోసీలు ఉన్నారు.
విన్నర్?
ఫార్ములావన్ రేసులో నిర్ణీత ల్యాప్స్‌ను పూర్తిచేసేందుకు డ్రైవర్లు పోటీ పడతారు. అయితే ఫార్ములా ఈ రేసు దీనికి భిన్నంగా ఉంటుంది. ముందుగా 45 నిమిషాల రేసులో పాల్గొనాలి. సమయం పూర్తి కాగానే ఒక ల్యాప్‌ను ముందుగా ఎవరు పూర్తి చేస్తారో వారిని ఫార్ములా ఈ రేసు విన్నర్‌గా ప్రకటిస్తారు.
ఇందులో 11 జట్లు.. 22మంది డ్రైవర్లు..
ఇక, ఫార్ములా ఈ రేసులో మొత్తం 11 జట్లు పాల్గొంటాయి. ఒక్కో జట్టులో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. ఈ నేపథ్యంలో.. 11 జట్లలో తయారీదారులు, వినియోగదారులకు సంబంధించిన టీమ్‌లు ఉంటాయి.
జట్లు
మ్యానుఫ్యాక్షరింగ్ టీమ్: జాగ్వార్, మహీంద్రా, మసేరటి, నియో 333, ఫోర్సే ఏజీ, నిసాన్,
డీఎస్ ఆటోమొబైల్స్
కస్టమర్ టీమ్స్: అవలాంచె ఆండ్రెట్టి ఫార్ములా ఈ, ఎన్విజన్ రేసింగ్, ఎంసీ లారెన్,
ఏబీటీ స్పోరట్స్లైన్
అంతే కాకుండా.. సీజన్ 9 క్యాలెండర్ ప్రకారం, రౌండ్ 1 మెక్సికో సిటీ ( మెక్సికో) 2023 జనవరి 14, రౌండ్ 2 దిరియా ( సౌదీ అరేబియా ) 2023 జనవరి 27, రౌండ్ 3 దిరియా ( సౌదీ అరేబియా ) 2023 జనవరి 28, రౌండ్ 4 హైదరాబాద్ (భారత్ ) 2023 ఫిబ్రవరి 11, రౌండ్ 5 కేప్ టౌన్ ( దక్షిణాఫ్రికా ) 2023 ఫిబ్రవరి 25, రౌండ్ 6 సావో పాలో ( బ్రెజిల్ ) 2023 మార్చి 25, రౌండ్ 7 బెర్లిన్ ( జర్మనీ ) 2023 ఏప్రిల్ 22, రౌండ్ 8 బెర్లిన్ ( జర్మనీ ) 2023 ఏప్రిల్ 23, రౌండ్ 9 మొనాకో 2023 మే 6, రౌండ్ 10 ఇంకా నిర్ణయించలేదు 2023 మే 20, రౌండ్ 11 జకర్తా ( ఇండోనేషియా ) 2023 జూన్ 4, రౌండ్ 12 జకర్తా ( ఇండోనేషియా ) 2023 జూన్ 4, రౌండ్ 13 ఇంకా నిర్ణయించలేదు 2023 జూన్ 24, రౌండ్ 14 రోమ్ ( ఇటలీ ) 2023 జూలై 16, రౌండ్ 15 రోమ్ ( ఇటలీ ) 2023 జూలై 16, రౌండ్ 16 లండన్ ( ఇంగ్లండ్ ) 2023 జూలై 29, రౌండ్ 17 లండన్ ( ఇంగ్లండ్ ) 2023 జూలై 30న ఉంటుంది.
https://www.youtube.com/watch?v=K4g223Z-W0M&feature=youtu.be