రేపే లాల్‌దర్వాజా బోనాలు.. 8 వేల మంది పోలీసులతో భద్రత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు హైదరాబాద్‌లో లాల్‌దర్వాజా బోనాలు జరగనున్నాయి.. ఇదే రోజు హైదరాబాద్ మొత్తం… శివారు ప్రాంతాలు.. మరికొన్ని గ్రామాల్లో కూడా బోనాలు తీయనున్నారు.. దీంతో.. పోలీసులు అప్రమత్తం అయ్యారు.. సిటీలో జరిగే బోనాల ఉత్సవాలకు భారీ భద్రత ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు సీపీ అంజనీకుమార్.. బోనాలు, అంబారీ ఊరేగింపు సందర్భంగా వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించిన ఆయన.. కమిషనర్ నుంచి హోంగార్డు వరకూ అందరూ బందోబస్తు విధుల్లో పాల్గొంటారని.. పాతబస్తీలోని పలు కాలనీల నుంచి బోనాల ఊరేగింపు లాల్ దర్వాజా మహంకాళి ఆలయానికి చేరుకుంటుందని.. రంగం, పోతురాజు ప్రవేశం కూడా ఉంటుందని.. అన్ని కార్యక్రమాలు సాఫీగా సాగేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.. బోనాలు విజయవంతంగా నిర్వహించేందుకు.. అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నామన్న సీపీ.. 8 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. లాల్‌దర్వాజలోని మహంకాళి టెంపుల్‌తో పాటు సిటీలో ఉన్న అన్ని ఆలయాల్లో పూజలు ఉండనున్నాయి.. ఎల్లుండి రంగంతో పాటు అంబారీ ఊరేగింపు కూడా ఉండడంతో.. ట్రాఫిక్ డైవర్షన్లు ఉంటాయి.. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.. కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సీసీ టీవీల ద్వారా ఊరేగింపు పర్యవేక్షిస్తామని తెలిపారు సీపీ అంజనీ కుమార్.
Also Read
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
- Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
- Auto Drivers Meet: ఆటో కార్మికులతో కీలక భేటీ.. సంక్షేమ బోర్డు, మీటర్ ఛార్జీలపై చర్చ!
తాజావార్తలు
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
-
Shaque: అనుమానాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Best Scooters for Women: మహిళలకు బెస్ట్ స్కూటర్లు ఇవే.. స్టైలిష్ లుక్, మంచి మైలేజ్‌తో అదిరిపోయే మోడల్స్!
-
Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!