Pulivarthi Sudha Reddy: చెవిరెడ్డి కుటుంబం బతిమాలడంతోనే వెనక్కి తగ్గా, లేదంటే.. పులివర్తి సుధారెడ్డి సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి రూరల్ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌పై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, రీకౌంటింగ్ కోరే అవకాశం ఉన్నప్పటికీ మానవతా దృక్పథంతో వెనక్కి తగ్గామని వెల్లడించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు బతిమాలడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. అయితే రీకౌంటింగ్ వదులుకోవడం తప్పు నిర్ణయమని ఇప్పుడు భావిస్తున్నట్లు సుధా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కౌంటింగ్ రూమ్‌ను మార్చడంపై తాము అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పులివర్తి సుధా రెడ్డి తెలిపారు. ఎన్నికల ఫలితాల్లో కేవలం 600 ఓట్ల తేడా మాత్రమే ఉండగా, 2 వేలకు పైగా ఓట్లు చెల్లనివిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రీకౌంటింగ్ కోరాలని భావించినప్పటికీ.. చెవిరెడ్డి కుటుంబ సభ్యులు తమ వద్దకు వచ్చి బతిమాలడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నామని చెప్పారు. పెద్ద కొడుకు ఇప్పటికే ఎన్నికల్లో ఓడిపోయాడని, చిన్న కొడుకు కూడా ఓడిపోతే డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉందని చెప్పి రీకౌంటింగ్ కోరవద్దని కుటుంబ సభ్యులు వేడుకున్నారని వెల్లడించారు. వారి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో రీకౌంటింగ్ పిటిషన్ వేయకుండా వెనక్కి తగ్గామని సుధా రెడ్డి తెలిపారు.
Also Read
- Sonia Gandhi: బాబ్రీ మసీదు కూలుస్తుంటే టీవీలో చూస్తూ ఏడ్చేశాను.. సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు..
- Ajinkya Rahane: "బుమ్రా, భువీ కాదు.. అతడే డేంజరస్ బౌలర్".. మనసులో మాట బయటపెట్టిన రహానే..
- Polavaram Election Results 2026: పోలవరం జిల్లాలో భిన్నమైన ప్రజాతీర్పు.. వైసీపీ, కూటమి హోరాహోరీ!
- Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
అయితే తాము చూపించిన హుందాతనాన్ని అవతలి వారు గౌరవించలేదని పులివర్తి సుధా రెడ్డి విమర్శించారు. రీకౌంటింగ్ వదులుకోవడం ద్వారా తప్పు చేశామని ఇప్పుడు అనిపిస్తోందని పేర్కొంటూ, తమ హుందాతనానికి, వారి దిగజారుడుతనానికి పోలిక లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి రూరల్ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌పై సుధా రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తిరుపతి రూరల్ జెడ్పీటీసీ అభ్యర్ధిగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి 600 ఓట్లతో విజయం సాధించారు.
తాజావార్తలు
-
Pulivarthi Sudha Reddy: చెవిరెడ్డి కుటుంబం బతిమాలడంతోనే వెనక్కి తగ్గా, లేదంటే.. పులివర్తి సుధారెడ్డి సంచలన వ్యాఖ్యలు!
-
Sonia Gandhi: బాబ్రీ మసీదు కూలుస్తుంటే టీవీలో చూస్తూ ఏడ్చేశాను.. సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు..
-
Vivo Y6k: వివో Y6k 5G స్మార్ట్‌ఫోన్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, IP65 రేటింగ్‌తో లాంచ్!
-
LK Advani Birthday: 100వ వసంతంలోకి ఎల్కే అద్వానీ.. బీజేపీ నిర్మాణంలో ఆయన పాత్రను గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ
-
Ajinkya Rahane: “బుమ్రా, భువీ కాదు.. అతడే డేంజరస్ బౌలర్”.. మనసులో మాట బయటపెట్టిన రహానే..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!