NTV Telugu Site icon

Bandi Sanjay Fires on KCR: తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేసిండు

Bandi Sanjay Fires On Kcr

Bandi Sanjay Fires On Kcr

తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీఎం కేసీఆర్‌ పై ఫైర్‌ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు, పింఛనుదారులకు పింఛన్లు ప్రతి నెల 1వ తేదీన చెల్లించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు లేఖ రాశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21, ఆర్టికల్‌ 300(ఏ) చట్టం.. సకాలంలో ఉద్యోగులు, పింఛనుదారులు వేతనం పొందే ప్రాథమిక హక్కుని కల్పించిందని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులకు తెలంగాణప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం వారి జీవించే హక్కును కాలరాయడమేనని బండిసంజయ్ లేఖలో తెలిపారు.

Read also: Neeraj Chopra: ఢిల్లీ నుంచి గల్లీ వరకు నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం

కాగా.. భారత రాజ్యాంగంలో ఆర్టికల్‌ 360 ప్రకారం ఫైనాన్షియల్‌ ఎమర్జెన్సీ ప్రకటిస్తే తప్ప ఉద్యోగుల, పెన్షన్‌దారుల చెల్లింపులు ఆలస్యం చేయకూడదని అన్నారు. అంతే కాకుండా..ఇతర అత్యవసర బిల్లులు కూడా ప్రభుత్వం పెండింగ్‌ లో పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్‌. అయితే.. హెల్త్‌ రియంబర్స్‌మెంట్‌, సరెండర్‌ లీవ్‌, జీపీఎఫ్‌, అడ్వాన్స్‌లు, పార్ట్‌ ఫైనల్‌ విత్‌డ్రాయల్‌, ఇలా అన్ని బిల్లులు నెలల తరబడి పెండింగులో ఉంటున్నాయని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంకోసం ఉద్యమించి వెన్నుదన్నుగా నిలిచిన ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం టీఆర్‌ఎస్‌ అసమర్థ పాలనకు నిలువుటద్దం అని బండి సంజయ్ విరుచుకుపడ్డారు. కాగా.. 2014లో 16వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని నేడు అప్పులపాలు చేశారని ఆరోపించారు. తెలంగాణలో ఉద్యోగులు, పెన్షన్‌దారులు ప్రతినెల 15వ తారీఖు వరకు జీతాల కోసం ఎదురుచూసే దౌర్భాగ్యస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కిందని బండి సంజయ్‌ దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు, పెన్షన్ దారులకు పెన్షన్లు ప్రతినెల 1వ తేదీన చెల్లించాలని లేఖలో పేర్కొంటూ ట్విట్ చేసారు.