Ponnam Prabhakar : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం సందర్శించారు. నూతనంగా నిర్మాణంలో ఉన్న 250 పడకల ఆసుపత్రి భవనాన్ని పరిశీలించిన మంత్రి, నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ.. “సుమారు ₹82 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునాతన సదుపాయాలతో కూడిన 250 పడకల హాస్పటల్ నిర్మాణం జరుగుతోంది. హుస్నాబాద్‌ను ఆరోగ్యరంగంలో నెంబర్ వన్ కేంద్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు.
Tata: పండగ సీజన్ లో అదరగొట్టిన టాటా మోటార్స్.. ఏకంగా లక్ష కార్ల సేల్..
ప్రస్తుతం ఆసుపత్రిలో ఎనిమిది మంది వైద్యులు పనిచేస్తున్నారని, కొత్త భవనం పూర్తి కాగానే 38 మంది డాక్టర్లు విధులు నిర్వర్తించనున్నారని తెలిపారు. హుస్నాబాద్‌లో నర్సింగ్ కాలేజీ స్థాపనకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “మహాసముద్రం గండి పనులు టూరిజం అభివృద్ధి కోసం వేగంగా కొనసాగుతున్నాయి. గౌరవెల్లి కాలువల పనులకు భూసేకరణ జరుగుతోంది. రైతులు అందరూ సహకరించాలని కోరుతున్నాను” అని తెలిపారు.
ఇక మహిళా సంఘాల అభ్యున్నతికి పొన్నం సత్తయ్య ట్రస్టు ద్వారా 13 రకాల వస్తువులతో కూడిన స్టీల్ పాత్రలను పంపిణీ చేసినట్లు తెలిపారు. “ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, ప్రాజెక్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్.. అన్ని రంగాల్లో హుస్నాబాద్ అభివృద్ధికి కృషి చేస్తున్నాం” అని మంత్రి స్పష్టం చేశారు.
AP News: మాయమాటలు చెప్పి.. పదో తరగతి విద్యార్థినిపై యువకుడు అత్యాచారం, చివరకు..!