Cruelty husband: అమ్మను నాన్నే చంపాడు.. కన్నతండ్రిపై కూతురు ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cruelty husband: కష్టాల్లోనూ, సుఖ సంతోషాల్లోనూ తోడుగా ఉండాల్సిన భర్త , ఆమె పాలిట కాలయముడయ్యాడు. పెండ్లి నాటి ప్రమాణాల్లో ఏడు అడుగులు వేసి కలకాలం తోడుగా ఉంటానని మాట ఇచ్చిన ఆయన.. కుటుంబ కలహాలతో కన్న కూతుళ్ల ఎదుటే భార్యపై శానిటైజర్ పోసి నిప్పంటించాడు. కూతుళ్లు వద్దంటున్నా మాట వినకుండా కఠినంగా ప్రవర్తించాడు. దీంతో ఇరవై రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె మృతిచెందింది. తల్లి మృతికి తండ్రే కారణమంటూ కూతుళ్లు ఫిర్యాదు చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మేడ్చల్‌లోని సూర్యనగర్‌కు చెందిన తిరునగర్‌కు చెందిన నవశ్రీ (33)కి సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారానికి చెందిన నరేందర్ (35)తో 15 ఏళ్ల కిందటే వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న వీరి కుటుంబంలో గత నెల 18న చిన్న గొడవ జరిగింది. అది కాస్త పెనుగాలిగా మారింది. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన నరేంద్ర తన భార్య నవ్యశ్రీపై శానిటైజర్ పోశాడు. ఆ తర్వాత నిప్పు పెట్టాడు. ఇంతలో చుట్టుపక్కల వారు గమనించి ఆమెకి అంటుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అనంతరం కుమార్తెలు ఇరుగుపొరుగు వారి సహాయంతో గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆమెకు మెరుగైన చికిత్స అందించారు. గత ఇరవై రోజులుగా ఆమెకు చికిత్స అందించిన వైద్యులు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మరణించినట్లు ప్రకటించారు.
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు
అయితే నవ్యశ్రీ మృతి చెందడంతో ఆమె పెద్ద కూతురు పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తండ్రి నరేంద్రపై ఫిర్యాదు చేసింది. తన తల్లి ప్రమాదవశాత్తు మంటలు అంటుకోలేదని, తండ్రి ఉద్దేశ్యపూర్వకంగా శానిటైజర్ చల్లి నిప్పంటించాడని చెప్పింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్నామని తండ్రికి వద్దని ఎంత చెప్పినా వినలేదని శానిటైజర్‌ను అమ్మపై చల్లి నిప్పుపెట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై స్పందించిన పోలీసులు నిందితుడు నరేందర్ పై 302, 201, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Arogya Mahila: రాష్ట్ర మహిళలకు ప్రభుత్వ దీవెన.. నేడు ‘ఆరోగ్య మహిళ’కు శ్రీకారం..
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!