ప్రేమగా వుండాల్సిన భార్య భర్తల అన్యోన్య జీవితంలో ఎటు చూసిన ఎడబాటే ఎదురవుతుంది. భర్త కొట్టాడనో, భార్య అలిగిందనో, ఆడపిల్లలకు పుట్టరనో ఇలాంటి కారణలతో కుటుంబంలో కలతలు ఏర్పడి వివాహ జీవితాలకు దూరమవుతున్నారు. క్షణికావేశంలో ఏంచేస్తున్నారనేది మరిచి వందేళ్ల జీవితాలను నాసనం చేస్తుకుంటున్నారు. ఇలాంటి ఘటన భాగ్యనగరంలో చోటుచేసుకుంది. తన భార్య మోసం చేసిందని, తనకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకుందని పోలీస్టేషన్ మెట్లెక్కాడు భర్త. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం. ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సుల్తాన్‌కు 2013లో రుబీనా బేగంతో పెద్దల సమక్షంలో వివాహచేసారు. అయితే ఆమె మళ్లీ 2017లో ముబీనుద్దీన్ అనే వ్యక్తితో రెండో వివాహం చేసుకుంది.
read also: MP Chhedi Paswan: ప్రధాని పదవి కోసం నితీష్ దావుద్ ఇబ్రహీంతో చేతులు కలపొచ్చు.
వారిద్దిరికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు వున్నారు. ఈనేపథ్యంలో తన మొదటి భర్త మహమ్మద్ సుల్తాన్ తన భార్య ముబీనుద్దీన్‌పై బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖులా (విడాకులు) మహ్మదీయ చట్టం. దానికి విదరుద్దంగా ఆమె మరొక వివామం చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. రుబీనా బేగం వేదింపుల కింద తప్పుడు కేసు పెట్టిందని, తనపై అసత్యప్రచారం చేస్తున్నారని తెలిపారు. తాను లైంగిక సామర్థ్య పరీక్ష సైతం చేయించుకుని ధ్రువ పత్రం తీసుకున్నట్లు ఫిర్యాదులో తెలిపాడు. రుబీనా బేగంతో పాటు, ఆమె తల్లి, సోదరుడు తనపై పలుమార్లు దాడికి పాల్పడ్డారని.. ప్రాణహాని వుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రుబీనాబేగం, ఆమె తల్లి ముంతాజ్‌బేగంలతోపాటు కుటుంబ సభ్యులైన హైదర్ అలీ, యూసుఫ్‌పాషా, మహ్మద్ ఖాసీం, ముబీనుద్దీన్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Shamshabad gold: చెప్పుల కింద బంగారం.. క్యాప్సల్ రూపంలో తరలించే ప్రయత్నం