Hyderabad: అన్యోన్య దంపతులు.. ఉప్పల్‌లో ఉప్పు బస్తాలు చోరీ చేసిన భార్య భర్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: టీవీల్లో, పేపర్లలో ఎన్నో రకాల దొంగతనాల గురించి విన్నాం చదివాము. అంతేకాదు తాళం వేసి ఉన్న ఇళ్లలో దోచుకునే వారు కొందరైతే చైన్ స్నాచింగ్ లకు పాల్పడే వారు మరికొందరైతే.. ATMలు, బ్యాంకులు దొంగతనం చేసేవాళ్లు ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యం ఏదో ఒక చోట రకరకాల దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. దొంగలు చోరీలకు పాల్పడే చోట విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. అయితే హైదరాబాద్‌లో ఓ విచిత్రమైన చోరీ జరిగింది. ఈ దొంగతనం చూసిన వాళ్లందరికి నవ్వు పక్కా రావాల్సిందే.. ఎందుకంటే వారు దొంగతనం చేసింది బంగారమో, వెండి వస్తువులు కాదండోయ్ ఉప్పును దొంగతనం చేశారు. అయితే ఈ దొంగతనానికి పాల్పడింది భార్య భర్తలు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఉప్పల్ లో చోటుచేసుకుంది.
ఓ అమ్మాయి, అబ్బాయి కలిసి ఓ కిరాణా దుకాణం ముందు ఉప్పు బస్తాలను దొంగిలించారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడు బస్తాల ఉప్పు దొంగలించారు. ఇద్దరు వచ్చి అర్ధరాత్రి తమ స్కూటీపై ఏడు బస్తాల ఉప్పును సైలెంట్ గా పెట్టుకున్నారు. ఎవరూ చూడకుండా అక్కడి నుంచి పరారయ్యారు. పాపం వాల్లకు తెలియని విషయం ఏంటంటే వాళ్లిద్దరూ చేసే దొంగతనం అంతా సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్నట్లు గమనించలేక పోయారు. అయితే వాళ్లిద్దరు ప్లాన్ ప్రకారమే చేస్తున్నట్లు అర్థమవుతుంది. దొంగతనానికి వచ్చిన ఇద్దరూ కూడా మాస్క్ ధరించి ఉప్పు దొంగతనం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ షాప్ ఓనర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు కథ బయటకు వచ్చింది.
Also Read
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడే ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించడగా.. వారిద్దరూ చేసిన దొంగతనం అంతా వెలుగులోకి వచ్చింది. అయినా ఉప్పు దొంగతనం చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ లో వినాయక చవితి వేడుకలు మొదలైన విషయం తెలిసిందే.. అయితే గణపతి చేతిలో లడ్డూ ఉండటం ఆనవాయితీ కూడా.. హైదరాబాద్‌లోని మియాపూర్ పరిధిలోని మదీనగూడలో ఓ వ్యక్తి వినాయకుడి చేతిలోని లడ్డూలను దొంగలించాడు. ఓంకార సేవా సమితి ఆధ్వర్యంలో భారీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గణేశుడి చేతిలో 11 కిలోల లడ్డూలను ఉంచారు. గణపతి బప్పా మోరియా.. అదా లడ్డు చోరియా.. అంటూ నినాదాలు చేసిన ఓ దొంగ.. ఆ లడ్డూ వైపు చూశాడు. ఆదా లడ్డూ ఏమోగానీ.. మొత్తం దోచేశాడు. ఈ చోరీ మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది.
TSRTC : బస్సు ప్రయాణికులుక గుడ్‌న్యూస్.. ఇలా చేస్తే 10 శాతం రాయితీ
తాజావార్తలు
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!