TSRTC : బస్సు ప్రయాణికులుక గుడ్‌న్యూస్.. ఇలా చేస్తే 10 శాతం రాయితీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రజలకు మరింత సేవలందించేందుకు కొత్త కొత్త స్కీంలను ప్రవేశపెడుతోంది. ఇప్పటకే చాలా వినూత్న పథకాలకు టీఎస్‌ఆర్టీసీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే మరోసారి ప్రజలకు మరో ఆఫర్‌ను ప్రకటించింది. దసరా పండుగ సందర్భంగా సొంతుళ్లకు వెళ్లే వారూ ముందుగా టీఎస్‌ఆర్టీసీలో బస్సు టికెట్లను బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ అందిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 15 నుంచి 29లోపు ఒకే సమయంలో టికెట్లు బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంలో 10 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు. ఆయా తేదీల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేదీ వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని సర్వీసుల్లో రాయితీ వర్తిస్తుందని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాలకు కూడా చాలా మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు 10 శాతం రాయితీ ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. ఈ తగ్గింపు దసరా పండుగ సెలవుల్లో 15 రోజులు మాత్రమే వర్తిస్తుంది. దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ రాయితీ సౌకర్యాన్ని వినియోగించుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. TSRTC బస్సులలో ముందస్తు రిజర్వేషన్ కోసం సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.in ని సంప్రదించాలని టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
తాజావార్తలు
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
-
Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
-
Dulquer Salman: ‘ఐ యామ్ గేమ్’ కోసం నాగ్ అశ్విన్ ఎడిటింగ్..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!