తెలుగు రాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా… అలాగే ఎగువ నుండి వస్తున్న వరద కారణంగా నాగార్జున సాగర్ జలాశయానికి భారీ ఇన్ ఫ్లో వస్తుంది. అయితే శ్రీశైలం గేట్లు ఎత్తడంతో పెరిగిన వరద ఇప్పుడు తగ్గుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు కు 84,309 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తుండటంతో,,, అవుట్ ఫ్లో కూడా 84,309 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 589.40 అడుగులకు చేరుకుంది.పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా…ప్రస్తుతం 310.2722 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. ఇప్పటికే డ్యామ్ గరిష్ట నీటి మట్టానికి చేసుకోవడంతో ప్రాజెక్టుకు 4 క్రస్ట్ గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక వరద మెళ్లిగా తగ్గుతుండటంతో గేట్లు ఎప్పుడైనా మూస్ అవకాశం ఉంది.