Traffic Challan: ట్రాఫిక్ చలాన్ డిస్కౌంట్ ఆఫర్‌కు భారీ స్పందన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల ఒక్క ఐడియా.. ఇప్పుడు కోట్లు కుమ్మరిస్తోంది.. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను వసూలు చేసేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తీసుకొచ్చిన డిస్కౌంట్ ఆఫర్‌కు అనూహ్యంగా స్పందన వస్తోంది.. చలాన్లు కట్టేందుకు వాహనదారులు పోటీ పడడంతో.. కొన్నిసార్లు సర్వర్ మొరాయించిన సందర్భాలు కూడా ఉన్నాయంటే.. వాహనదారులు ఏ స్థాయిలో పెండింగ్ చలాన్లు క్లియర్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.. ఇక, దీనికి సంబంధించిన తాజా డేటాను విడుదల చేశారు ట్రాఫిక్ పోలీసులు.. ఈ నెల 1వ తేదీ నుంచి ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ ప్రారంభం కాగా.. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎన్ని చలాన్లు క్లియర్ అయ్యాయి.. వాహనదారులు ఎంత మొత్తాన్ని చెల్లించారనే గణాంకాలు వెల్లడించారు.
Read also: MS Dhoni: లక్కీ నెంబర్.. సీక్రెట్ బయటపెట్టిన ధోనీ..!
Also Read
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
తెలంగాణ వ్యాప్తంగా మార్చి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు 1.3 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యినట్టు వెల్లడించారు ట్రాఫిక్ పోలీసులు.. 15 రోజుల వ్యవధిలో చలాన్ల రూపంలో రూ. 130 కోట్లు ఫైనల్‌లు చెల్లించారు వాహనదారులు.. ఇది సాధారణ ఛార్జ్లతో చూస్తే మాత్రం రూ. 600 కోట్లుగా ఉంది.. ఇక, పేరుకుపోయిన ట్రాఫిక్ చలాన్లు కట్టినవారిలో 80 శాతానికి పైగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలోని వాహనదారులే ఉన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 31వ తేదీ వరకు ఆ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.. మార్చి 1వ తేదీ.. ఆ తర్వాతే కాదు.. ఇప్పటికే నిమిషానికి వెయ్యికి పైగా చలాన్ల చొప్పున వాహనదారులు చలాన్లు క్లియర్ చేసుకుంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు.. అయితే, మొదటి రోజే 5 .5 కోట్ల రూపాయలు ఫైన్లు చెల్లించారు.. డిసెంబర్ 2021 వరకు 80లక్షల పెండింగ్ చలాన్లు ఉన్నాయని తేల్చిన పోలీసులు.. పెండింగ్ చలాన్ క్లియరెన్స్ కోసం బంపర్ ఆఫర్ తీసుకొచ్చారు.. వన్ టైమ్ డిస్కౌంట్ పేరుతో పెట్టిన చలాన్ల క్లియరెన్స్‌కు ప్రజల నుండి భారీ స్పందన వస్తోంది.
తాజావార్తలు
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!