Site icon NTV Telugu

Fire Accident: అంకురా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..

Ankura Hospital

Ankura Hospital

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించించింది. నగరంలో ఓ హస్పిటల్లో ఒక్కసారిగా భారీ మంటలు ఎగసిపడ్డాయి. అత్తాపూర్ మెట్రో పిల్లర్ 60 సమీపంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకుర్ ఉమెన్ హాస్పటల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐదో ఫ్లోర్ నుంచి పదో ఫ్లోర్ వరకు మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన పేషెంట్లను బయటకు పంపించారు. అనంతరం ఈ ఘటనపై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు.

Also Read: Vivek Bindra Controversy: పేరుకు పెద్ద మోటివేషన్ స్పీకర్.. పెళ్లైన కొన్ని గంటలకే భార్యపై గృహ హింస

వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆసత్రిని పరిశీలించారు. షాట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అంచన వేశారు. కాగా ఆస్పత్రిలో ఎక్కువ శాతం గర్భిణులు, చిన్నారులు ఉండటంతో అక్కడ ఆందోళన పరిస్థితి నెలకొంది. సమాయనికి ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. హాస్పిటల్‌కు ఉన్న హోర్డింగ్‌కు మంటలు అంటుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదిన ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. హాస్పిటల్ బోర్డ్‌లో ముందుగా మంటలు వ్యాపించడంతో పదవ ప్లోర్ వరకు మంటల భారీ ఎత్తున్న ఎగసిపడ్డాయని, సమాయానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలు లోపలికి వ్యాపించకుండా కంట్రోల్ చేసినట్టు ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది.

Exit mobile version