హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించించింది. నగరంలో ఓ హస్పిటల్లో ఒక్కసారిగా భారీ మంటలు ఎగసిపడ్డాయి. అత్తాపూర్ మెట్రో పిల్లర్ 60 సమీపంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకుర్ ఉమెన్ హాస్పటల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐదో ఫ్లోర్ నుంచి పదో ఫ్లోర్ వరకు మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన పేషెంట్లను బయటకు పంపించారు. అనంతరం ఈ ఘటనపై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. Also…