NTV Telugu Site icon

Maoist: నేటి నుంచి మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు.. పోలీసుల అలర్ట్

Mavoiest

Mavoiest

Maoist: తెలంగాణ-ఛత్తీ్‌స్ గఢ్‌ సరిహద్దుల్లోని అడవుల్లో హైటెన్షన్‌ వాతావరణం కొనసాగుతుంది. నేటి (డిసెంబర్ 2) నుంచి జరగనున్న మావోయిస్టు పార్టీ పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలకు దండకారణ్యం వేదికగా మారింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏజెన్సీలు, అడవుల్లో నక్సల్స్‌ కోసం గాలిస్తున్నారు. మండలాల్లో.. సరిహద్దులకు దారి తీసే మార్గాల్లో భారీగా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ నాకా బందీ నిర్వహిస్తున్నారు పోలీసులు.. ఇప్పటికే ముందు జాగ్రత్తగా అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేయించి.. హిట్‌ లిస్టులో ఉన్న నేతలను అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.

Read Also: Pushpa 2: పుష్ప 2పై షాకింగ్ ట్వీట్ పెట్టి డిలీట్ చేసిన టీడీపీ ఎంపీ

కాగా, ఈ సంవత్సరం జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 261 మంది మావోయిస్టులు చనిపోయిన నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణకు పీఎల్‌జీఏ ఈ వారోత్సవాలను వేదికగా మార్చుకోగా.. ఆ ప్రయత్నాలను భగ్నం చేయాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో.. అడవుల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొంటోంది. ఛత్తీ్‌సగఢ్‌లో గడ్డు పరిస్థితులు ఎదురవుతుండటంతో తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్న మావోయిస్టులకు.. ఇక్కడి భూభాగంపై కాలు పెట్టగానే.. కాల్పులు ఘన స్వాగతం పలుకుతాయి అన్నట్లుగా నిఘా వ్యవస్థ పెరిగిపోయింది. ఈ ఏడాది తెలంగాణలో 4 ఎన్‌కౌంటర్లు జరిగాయి.. 15 మంది నక్సల్స్‌ చనిపోగా.. వీరిలో ముగ్గురు మాత్రమే తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. మిగతా వారందరూ ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన వారే అని పోలీసులు వెల్లడించారు.